అన్వేషించండి

AC Service Tips: AC సర్వీస్ పేరుతో స్కామ్‌! ఈ 5 విషయాలను చెక్ చేయకుంటే మోసపోవడం ఖాయం! 

AC Service Tips: వేసవి కాలం ప్రారంభమైన వెంటనే, ఇళ్లలోని ఎయిర్ కండిషనర్లతో పని పడుతుంది. చాలా మంది నెలలపాటు మూలన పడేసిన వాటిని ఆన్‌ చేస్తారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • AC సర్వీసింగ్ ముందు శుభ్రపరచడం, ఫిల్టర్లు, కాయిల్స్ దుమ్ము తొలగించడం ముఖ్యం.
  • గ్యాస్ తగ్గితే లీక్ గుర్తించి, సరిచేసాకే రీఫిల్ చేయించాలి.
  • డ్రెయిన్ పైపు, అవుట్‌డోర్ యూనిట్ కండెన్సర్ శుభ్రత తప్పనిసరి.
  • కంప్రెసర్ శబ్దాలు, విద్యుత్ వాడకం సరిచూసుకుంటే AC పనితీరు మెరుగు.

AC Service Tips: వేసవి కాలం ప్రారంభమైన వెంటనే, ఇళ్లలోని ఎయిర్ కండిషనర్లకు పని చెబుతారు. నెలల తరబడి వాటిని ఆన్‌ చేయకుండా వదిలేసి వేసవి ఉక్కపోత మొదలైనప్పటి నుంచి ఆన్ చేస్తారు. అలా ఆన్ చేసే ముందు మొదట సరిగ్గా సర్వీస్ చేయడం మంచిది.  లేకుంటే నష్టం జరిగడమో, లేదా విద్యుత్ బిల్ ఎక్కువ రావడమో జరుగుతుంది. 

సర్వీస్‌ విషయంలో చాలా మంది ముందుగా టెక్నీషియన్‌కు కాల్ చేస్తారు. పూర్తి వారిపైనే వదిలేస్తారు. దీని వల్ల వినియోగదారులకు చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే సర్వీస్ సమయంలో కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది. అప్పుడే వేసవి రోజుల్లో ప్రశాంతంగా ఉండొచ్చు.  

ముందుగా, శుభ్రపరచడంపై శ్రద్ధ పెట్టండి. విండో AC అయినా లేదా స్ప్లిట్ AC అయినా, సరైన విధంగా క్లీన్ చేయడం చాలా ముఖ్యం. విండో ACలను తీసివేసి శుభ్రం చేయాలి, అయితే స్ప్లిట్ ACలు ఎయిర్ ఫిల్టర్, ఇండోర్ యూనిట్, కూలింగ్ కాయిల్స్ నుంచి మురికిని పూర్తిగా తొలగించాలి. కాయిల్స్‌పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి చల్లదనాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. శుభ్రపరచడం అసంపూర్ణంగా వదిలేస్తే, AC సరైన చల్లధనం అందించదు. మీరు తరచుగా మళ్లీ టెక్నీషియన్ కోసం కాల్ చేయాల్సి రావచ్చు.

చాలాసార్లు, సర్వీస్ సమయంలో, సరైన చెకింగ్‌ లేకుండా గ్యాస్ నింపమని మీకు సలహా ఇస్తారు. వెంటనే దీనికి అంగీకరించే బదులు, గ్యాస్ ప్రెజర్ చెక్ చేయించుకోండి. గ్యాస్ నిజంగా తక్కువగా ఉంటే, ముందుగా లీక్ కి కారణాన్ని గుర్తించి దాన్ని సరిచేయడం ముఖ్యం. లీక్‌ని సరిచేయకుండా గ్యాస్ నింపడం వల్ల సమస్య పునరావృతమవుతుంది. దీని వల్ల మీ జేబుకు చిల్లుపడుతుంది.  

శుభ్రపరచడంతోపాటు, పైప్‌లైన్‌ సిస్టమ్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. మూసుకుపోయిన AC డ్రెయిన్ పైపు వల్ల నీరు కారుతున్నట్లు లేదా లీక్ అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తాయి. అందువల్ల, సర్వీస్ తర్వాత, నీరు సరిగ్గా వస్తుందా లేదా అనే విషయాన్ని చెక్ చేయండి. కొన్ని నిమిషాలు ACని రన్‌ చేయడం వల్ల ఇలాంటివి తెలియకపోవచ్చు. అందుకే ఎక్కువసేపు ఏసీ ఆన్‌ చేసి ఉంచడం ద్వారా ఇలాంటి లోపాలను పరీక్షించవచ్చు.

అవుట్‌డోర్ యూనిట్ పరిస్థితి ఇండోర్ యూనిట్ లాగానే ముఖ్యమైంది. అవుట్‌డోర్ యూనిట్ కండెన్సర్ రెక్కలపై దుమ్ము పేరుకుపోవడం వల్ల కూడా ఏసీ పనితీరులో మార్పు వస్తుంది. శీతలీకరణపై ప్రభావం చూపుతుంది. అవుట్‌డోర్ యూనిట్‌ను వాటర్‌ ప్రెషర్‌తో పూర్తిగా శుభ్రం చేశారని నిర్ధారించుకోండి. అవుట్‌డోర్ యూనిట్ చెత్త ఉంటే, లోపలి భాగాన్ని శుభ్రం చేయడం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు కోల్పోతాయి. అందుకే రెండింటీలో కూడా ధుమ్ముధూళి లేకుండా శుభ్రం చేయించుకోవాలి. 

సర్వీస్ పూర్తయిన తర్వాత, కూలింగ్ ఎఫెక్ట్‌పై మాత్రమే కాకుండా కంప్రెసర్ సౌండ్‌పై కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు ఏవైనా అసాధారణ శబ్దాలు విన్నట్లయితే, వెంటనే ఎంక్వయిరీ చేయండి. AC సరైన మొత్తంలో కరెంట్‌ను తీసుకుంటుందో లేదో ఆంపియర్ మీటర్‌తో తనిఖీ చేయడం కూడా తెలివైన పని. ఈ విషయాలను నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీ AC సరిగ్గా సర్వీస్ చేశారో లేదో సీజన్ అంతటా సజావుగా నడుస్తుందని మీరు నిర్ధారించుకోగలరు.

Frequently Asked Questions

AC సర్వీస్ చేసే ముందు ఏమి చేయాలి?

వేసవి ప్రారంభంలో AC ఆన్ చేసే ముందు దానిని సరిగ్గా సర్వీస్ చేయడం మంచిది. లేకపోతే నష్టం జరగవచ్చు లేదా విద్యుత్ బిల్లు పెరగవచ్చు.

AC సర్వీస్ సమయంలో శుభ్రపరచడం ఎందుకు ముఖ్యం?

AC భాగాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి చల్లదనాన్ని తగ్గిస్తాయి. శుభ్రపరచడం సరిగ్గా చేయకపోతే AC సరైన చల్లదనాన్ని అందించదు.

ACలో గ్యాస్ నింపేటప్పుడు ఏమి గమనించాలి?

గ్యాస్ ప్రెజర్ చెక్ చేయించుకోండి. గ్యాస్ తక్కువగా ఉంటే, ముందుగా లీక్ కారణాన్ని గుర్తించి సరిచేయడం ముఖ్యం.

AC డ్రెయిన్ పైపు సమస్యలను ఎలా నివారించాలి?

సర్వీస్ తర్వాత నీరు సరిగ్గా బయటకు వెళ్తుందో లేదో చెక్ చేయండి. కొన్ని నిమిషాలు AC రన్ చేయడం వల్ల లోపాలు తెలియకపోవచ్చు, కాబట్టి ఎక్కువసేపు ఆన్ చేసి పరీక్షించండి.

AC సర్వీస్ పూర్తయిన తర్వాత ఏయే విషయాలపై శ్రద్ధ పెట్టాలి?

కూలింగ్ ఎఫెక్ట్ తో పాటు కంప్రెసర్ సౌండ్ పై శ్రద్ధ పెట్టండి. అసాధారణ శబ్దాలు వినిపిస్తే ఎంక్వయిరీ చేయండి, కరెంట్ వినియోగాన్ని కూడా తనిఖీ చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
Washing Machines: ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Murala Jyothi: చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Embed widget