![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఢిల్లీలో బంగారం ధర రూ.700 మేర పెరిగింది. వెండి ధర రూ.900 మేర భారీగా పుంజుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బంగారం, వెండి ధరలకు డిమాండ్ పెరగడంతో ధరలు పుంజుకున్నాయి.
![Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా.. Gold Silver Price Today 18 December 2021 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/16/24a802fe9e5f7dd7c25e8da406d9ece3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gold Rate Today Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు వరుసగా రెండోరోజు పెరిగింది. మరోవైపు వెండి ధర సైతం భారీగా పెరిగింది. బంగారం ధర రూ.370 మేర పెరగగా, వెండి ధర రూ.900 మేర భారీగా పుంజుకుంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,700 కాగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,850 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.800 మేర భారీగా పుంజుకోవడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,900గా ఉంది. ఇటీవల 65 వేల దిగువకు పడిపోయిన వెండి ధరలు పెరుగుతున్నాయి.
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధర రూ.400 మేర పెరగగా, వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. విజయవాడలో పసిడి ధర రూ.400 మేర పెరగగా 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,850 అయింది.. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,700కు చేరింది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,700 కు ఎగబాకింది. వెండి ధరలు ఏపీ, తెలంగాణలో ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారంపై రూ.530 మేర పెరగగా 10 గ్రాముల ధర రూ.50,120 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,940 అయింది. ఢిల్లీలో బంగారం ధర రూ.700 మేర పెరిగింది. ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200 కు చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,720 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,720 వద్ద మార్కెట్ అవుతోంది.
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ప్లాటినం ధరలో భారీ పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.62 మేర పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,810 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,870 వద్ద యథాతథంగా ఉంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)