Deputy CM Pawan Kalyan on Janasena Win | జనసేనగా నిలబడ్డాం..40ఏళ్ల టీడీపీని నిలబెట్టాం | ABP Desam
అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని తొడలు చరిచిన ఎంతో మంది వ్యక్తుల తొడల్ని బద్ధలు కొట్టి జనసేన పార్టీ అధికారంలో భాగస్వామ్యం అయ్యిందన్నారు పవన్ కళ్యాణ్. భయమన్నది లేకుండా జనసేనగా నిలబడి...40ఏళ్ల టీడీపీని నిలబెట్టామన్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తిని కూడా తీసుకువెళ్లి జైళ్లలో పడేసిన పరిస్థితుల్లో టీడీపీ కి అండగా నిలబడటంతో పాటు తాము ఓ పార్టీగా నిలదొక్కుకుని సంచలన విజయం సాధించామన్నారు పవన్ కళ్యాణ్. తమను అవమానించిన, వీర మహిళలను హేళన చేసిన ఎంతో మంది దుర్మార్గులను నేలకు అందించి అథ పాతాళానికి ప్రజాబలంతో తొక్కేయగలిగామన్నారు పవన్ కళ్యాణ్. ఈ ప్రయాణంలో ఎక్కడా భయం అన్నది లేకుండా ముందు అడుగు వేశాం కాబట్టే ఓ పార్టీగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి దేశంలో అతి గొప్ప రికార్డును కైవసం చేసుకున్నామన్నారు పవన్ కళ్యాణ్.





















