Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Tamannaah Vijay Varma Breakup Rumours: ప్రముఖ నటి తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ బ్రేకప్ వార్తల నేపథ్యంలో ఇద్దరూ హోలీ వేడుకల్లో పాల్గొనడం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Tamannaah Vijay Varma In Holi Celebrations: మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) మధ్య బ్రేకప్ అయ్యిందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తాజాగా హోలీ వేడుకల్లో సందడి చేశారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో ఇద్దరూ పాల్గొన్నారు.
విడివిడిగా హాజరు..
గతంలో ప్రేమలో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి ప్రతి పార్టీ, ఈవెంట్లకు హాజరయ్యేవారు. ఇప్పుడు మాత్రం విడివిడిగా రవీనా ఇంటికి వచ్చారు. ఫోటోగ్రాఫర్లను పలకరించుకుంటూ వెళ్లి.. హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బ్రేకప్ వార్తలపై ఇద్దరూ ఇప్పటివరకూ స్పందించలేదు. ఈ క్రమంలో ఒకే కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొనడంపై ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
బ్రేకప్ వార్తలు హల్చల్.. అసలు కారణం అదేనా..?
2023లో విడుదలైన 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ చేసేటప్పుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడ్డారు. ఈ సిరీస్ రిలీజ్ కాక ముందే వీరు గోవాలో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తమన్నా విజయ్ వర్మతో ప్రేమ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుంచి దాదాపు రెండేళ్లు వీరు చాలా ఈవెంట్లకు కలిసి హాజరయ్యారు. పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం సాగింది. అయితే, బాలీవుడ్‌లో 'లవ్ బర్డ్స్' ట్యాగ్ సొంతం చేసుకున్న వీరి మధ్య రిలేషన్ షిప్ బ్రేకప్ అయ్యిందంటూ గత కొద్ది రోజులుగా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి, కెరీర్ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని.. అందుకే బ్రేకప్ నిర్ణయం తీసుకున్నారనే బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది.
పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని తమన్నా నిర్ణయించుకోగా.. విజయ్ వర్మ కెరీర్‌పైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీంతోనే బ్రేకప్ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తమన్నా ఇటీవల సడన్‌గా విజయ్ వర్మ ఫోటోలను తన ఇన్ స్టా నుంచి డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడిపోయారనే వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రేమ బేషరతుగా ఉంటుందని.. అయితే రిలేషన్‌షిప్ అనేది ఓ బిజినెస్ ట్రాన్షాక్షన్ వంటిదని అన్నారు. మన ఫ్రెండ్, ప్రేమించేవాడిని కాస్ తెలివిగా సెలక్ట్ చేసుకోవాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇప్పటివరకూ వ్యక్తిగతంగా ఇద్దరూ దీనిపై స్పందించలేదు.





















