గిల్ భాయ్.. పాత బాకీ తీర్చేయ్
ఈ ఫోటో చూసిన ప్రతిసారీ భారతీయుల రక్తం మరుగుతుంది. ఓ దిక్కుమాలిన అడుక్కుతినే దేశం తరపున క్రికెట్ ఆడుతూ ఒక్క వికెట్ తీయగానే అదేదో పెద్ద ఘనత సాధించేసినట్లు పాక్ స్పిన్నర్ చేసిన ఈ చర్య ఇప్పటికీ ఇండియన్ ఫ్యాన్స్‌కి ఒళ్లు మండేలా చేస్తుంది. ఈ ఆసియా కప్‌లో దీనికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ మనస్పూర్తిగా కోరుకుంటుంటారు. అసలేం జరిగిందంటే.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఇచ్చిన 242 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో రోహిత్ శర్మ 20 రన్స్‌కే అవుటైనా.. విరాట్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ షహీన్ అఫ్రిదీ, నసీమ్ షా హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించాడు. అయితే మంచి ఊపు మీదున్న గిల్‌ని 46 రన్స్ దగ్గర పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ క్లాన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ తీసిన అబ్రార్.. గిల్‌ని బయటకు పో అన్నట్లు సైగ చేశాడు. ఈ సీన్ చూసిన ప్రతి ఇండియన్ కోపంతో రగిలిపోయాడు. ఇక ఇప్పుడు ఆసియా కప్‌లో మళ్లీ వీళ్లిద్దరూ ఎదురుపడబోతుండడంతో.. ‘గిల్ భాయ్.. పాత బాకీ తీర్చేయ్.. అబ్రార్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయ్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. విచిత్రం ఏంటంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో గిల్ వికెట్ తీసిన అబ్రార్ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా.. ఆ తర్వాత కోహ్లీ సెంచరీతో రెచ్చిపోయి పాక్ బౌలర్లని ఉతికారేయడమే కాకుండా.. చివరి వరకు నాటౌట్‌గా నిలబడి టీమిండియాకి సూపర్ విక్టరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ లేడు కాబట్టి.. ఆ బాధ్య ప్రిన్స్ గిల్‌పైనే ఉంటుందని కూడా ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. అది మాత్రమే కాకుండా.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో షహీన్ అఫ్రీదీ బౌలింగ్‌ని ఈ మ్యాచ్‌లో గిల్ ఏ రేంజ్‌లో ఆడుకుంటాడో కూడా చూడాలంటూ ఫ్యాన్స్ సెటైర్లు పేలుస్తున్నారు.





















