Kaun Banega Crorepati: 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోకు అమితాబ్ గుడ్ బై చెప్పారా? - ఆ రూమర్స్‌లో నిజమేంటో తెలుసా!, బిగ్ బీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Amitabh Bachchan: కౌన్ బనేగా కరోడ్‌పతి షో తర్వాత సీజన్‌కు కొత్త హోస్ట్ వస్తారన్న రూమర్లకు స్వయంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చెక్ పెట్టారు. 16వ సీజన్ లాస్ట్ ఎపిసోడ్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Amitabh Bachchan Clarified About His Retirement Rumours From Kaun Bangega Crorepati Rumours: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా వస్తోన్న ప్రముఖ క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (Kaun Banega Crorepati). ఇటీవలే 16వ సీజన్ పూర్తి కాగా.. ఈ షో హోస్ట్ నుంచి అమితాబ్ తప్పుకుంటారనే వార్తలు హల్చల్ చేశాయి. తర్వాత సీజన్ హోస్ట్‌గా ఐశ్వర్యారాయ్ బచ్చన్ షారుఖ్ ఖాన్ వ్యవహరించొచ్చనే రూమర్స్ వచ్చాయి. దీనిపై స్వయంగా బిగ్ బీ అమితాబ్‌నే క్లారిటీ ఇచ్చారు.
'నెక్స్ట్ సీజన్‌లో మళ్లీ కలుద్దాం'
తర్వాత సీజన్‌కు తానే హోస్ట్‌గా వ్యవహరిస్తానని అమితాబ్ బచ్చన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. 16వ సీజన్ చివరి ఎపిసోడ్‌లో దీని గురించి మాట్లాడిన ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. రూమర్స్ అన్నింటికీ ఆ ఒక్క ప్రసంగంతో చెక్ పెట్టారు. 'గత 16 సీజన్లలో కౌన్ బనేగా కరోడ్‌పతి విశేష ఆదరణ పొందింది. నేను హోస్ట్‌గా వ్యవహరించిన ప్రతిసారీ ఆడియన్స్ నుంచి ఎంతో ప్రేమ మద్దతు లభించాయి. గత 25 ఏళ్లుగా మమ్మల్ని అదే ప్రేమ, మద్దతు నిలబెట్టింది.
Also Read: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం - యూకే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటన
మా 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం నిజంగా విజయవంతమైందని నేను భావిస్తున్నాను. కాబట్టి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను వచ్చే సీజన్‌లో మిమ్మల్ని కలుస్తాను. మీ కృషిని నమ్ముతూ ఉండండి, మీ కలలను సజీవంగా ఉంచుకోండి. ఆగకండి, తలవంచకండి. మీరు ఎలా ఉన్నారో అలా ఉంటేనే విలువైన వారు. మనం మళ్లీ కలిసే వరకు ఈ సీజన్ నుంచి నిష్క్రమిస్తున్నాను' అని బిగ్ బీ పేర్కొన్నారు.
టీవీ షోల్లోనే ప్రత్యేక స్థానం
ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ కలిగిన గేమ్ షోల్లో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఒకటి. విజ్ఞానం, వినోదంతో పాటు ఎందరో యంగ్ టాలెంట్ ఈ షో ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యారు. ఈ షోను పోలిన చాలా గేమ్ షోలు వచ్చినా అంతగా ప్రాచుర్యం పొందలేదు. KBC అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అమితాబ్ బచ్చన్. మొత్తం 16 సీజన్లలో తనదైన శైలితో షోకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఈ షోకు ఆయన్ను తప్ప వేరే వారిని హోస్ట్‌గా ఊహించలేమంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఆయన తర్వాత సీజన్ నుంచి తప్పుకొంటారనే వార్తలు హల్చల్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు. దీంతో లాస్ట్ ఎపిసోడ్‌లో బిగ్ బీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
అయితే, 8 పదుల వయసులోనూ అమితాబ్ తన నటనతో ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. గతేడాది ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో అశ్వత్థామ పాత్రలో నిలిచి సినిమాకే హైలెట్‌గా నిలిచారు. అలాగే, సూపర్ స్టార్ రజినీ వేట్టయాన్ సినిమాలో జస్టిస్ సత్యదేవ్‌గా మెప్పించారు. ప్రస్తుతం ఆయన 'రామాయణ' నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటే కేబీసీ నెక్స్ట్ సీజన్‌కు హోస్ట్‌గా సిద్ధమవుతున్నారు.





















