Ranbir Kapoor: రణబీర్ కపూర్ హిట్ మూవీ సీక్వెల్ వచ్చేది అప్పుడేనా! - 'బ్రహ్మాస్త్ర 2'పై కీలక అప్ డేట్, అసలు కథ అప్పుడే అంటూ..
Brahmastra 2 Movie: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర 2'పై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ 'వార్ 2' ప్రాజెక్టులో బిజీగా ఉన్నారని.. ఆ తర్వాత సీక్వెల్ ప్రారంభం అవుతుందన్నారు.

Ranbir Kapoor's Brahmastra 2 Movie Update: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) 2022లో భారీ విజయం అందుకున్న విషయం తెలిసింది. ఈ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించి రణబీర్ కీలక అప్ డేట్ పంచుకున్నారు. త్వరలోనే 'బ్రహ్మాస్త్ర 2' ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందన్నారు.
'పార్ట్ 2లోనే అసలు కథ'
'బ్రహ్మాస్త్ర 2: దేవ్' (Brahmastra 2) అయాన్ ముఖర్జీ కలల ప్రాజెక్ట్ అని.. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హై ప్రొఫైల్ యాక్షన్ మూవీ 'వార్ 2' కోసం బిజీగా ఉన్నారని రణబీర్ కపూర్ (Ranbir Kapoor) చెప్పారు. అది పూర్తైన అనంతరం 'బ్రహ్మాస్త్ర 2' ప్రారంభిస్తారన్నారు. 'అయాన్ అనుకున్న కథలో ఇప్పటివరకూ కొంతనే మనం చూశాం. పార్ట్ 2లోనే అసలు కథంతా ఉండబోతోంది. ఈ సీక్వెల్ గురించి త్వరలోనే అప్‌డేట్స్ ఉంటాయి'. అని రణబీర్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సీక్వెల్ వాయిదా పడిందనే రూమర్స్‌కు చెక్ పడింది. త్వరలోనే 'బ్రహ్మాస్త్ర 2' పట్టాలెక్కనుంది.
Also Read: అఫీషియల్‌గా వీరమల్లు వాయిదా... మేకి వెళ్లిన పవన్ - నితిన్, నాగవంశీ సినిమాలకు లైన్ క్లియర్
'ఆయనతో వర్క్ చాలా స్పెషల్'
తన లేటెస్ట్ ప్రాజెక్ట్ లవ్ & వార్ గురించి రణబీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'ఈ సినిమాలో నటించాలని ప్రతి నటుడు కలలు కంటాడు. సంజయ్ బన్సాలీ వంటి అద్భుతమైన దర్శకుడితో వర్క్ చాలా స్పెషల్. అలియాభట్, విక్కీ కౌశల్‌తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. సంజయ్‌తో 17 ఏళ్ల క్రితం సావారియా అనే మూవీలో నటించాను. ఇప్పుడు మళ్లీ ఆయనతో కలిసి వర్క్ చేయడం స్పెషల్. ఆయనతో సినిమా అంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ లవ్ అండ్ వార్ చిత్రీకరణ నాకెంతో నచ్చింది.' అని రణబీర్ చెప్పారు.
అభిమానుల మనసులు గెలిచేశారు..
రణబీర్ భార్య, బాలీవుడ్ నటి అలియా భట్ పుట్టినరోజు ఈ నెల 15న జరుపుకొంటుండగా.. 3 రోజుల ముందు నుంచే ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను రణబీర్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే మీడియా సమక్షంలో ఆమెతో కేక్ కట్ చేయించి తర్వాత రిపోర్టర్లతో సరదాగా మాట్లాడారు. ఫ్లోర్‌పై కూర్చుని వారితో ఫోటోలు దిగారు. తన లేటెస్ట్, రాబోయే ప్రాజెక్ట్స్ గురించి విశేషాలను వారితో పంచుకున్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై రణబీర్, అలియాపై సినీ ప్రియులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలిబ్రిటీలైనా ఫోటోగ్రాఫర్లతో వారు వ్యవహరించిన తీరును ప్రశంసిస్తున్నారు.
THEM. ♥️#RanbirKapoor celebrates #AliaBhatt’s birthday with the media.#FilmfareLens pic.twitter.com/wb0q9M6NN9
— Filmfare (@filmfare) March 13, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

