రూ.2లక్షల కోట్లతో 114 రఫేల్ ఫైటర్స్.. దేశ చరిత్రలోనే అతిపెద్ద డీల్!
దేశ రక్షణ రంగంలోనే అతిపెద్ద డీల్.. ఏకంగా రూ.2 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు అంతా రెడీ. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన కీలక ప్రతిపాదనలని పరిగణలోకి తీసుకున్న కేంద్రం.. అతి త్వరలో వీటి కొనుగోలు ప్రక్రియని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే.. ఈ 114 రఫేల్ యుద్ధ విమానాలని భారత్‌లోనే తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో టాటా సహా పలు భారత ఏరోస్పేస్ సంస్థలు కూడా పార్ట్‌నర్‌షిప్ కాబోతున్నాయి. పైగా ఈ ప్రాజెక్ట్‌లో 60 శాతానికి పైగా ఇండియన్ ఇండీజీనియస్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారట. ఒకవైపు పాకిస్తాన్, ఇంకోవైపు చైనాలతో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా భారత్‌కి త్రెట్ పొంచి ఉండటంతో.. భారత్ తన ఆయుధ సందపని పెంచుకోవడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ మనం గ్రౌండ్ ఆర్మీ విషయంలో బలంగానే ఉన్నా.. ఎయిర్ ఫోర్స్, నేవీ విషయంలో వెనుకబడి ఉన్నాం. అందుకే ఈ మధ్య కాలంలో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ని స్ట్రెంగ్తెన్ చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఐఏఎఫ్ చేసిన 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనపై వేగంగా ముందడుగు వేస్తోంది. ఐఏఎఫ్ ప్రతిపాదనపై ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల్లో చర్చ జరుగుతోంది. ఈ చర్చల తర్వాత డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డుకు పంపుతుంది. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తే.. భారత రక్షణ రంగ చరిత్రలో అతిపెద్ద ఒప్పందంగా ఇది నిలవనుంది. అలాగే ఈ 114 రఫేల్ యుద్ధ విమానాలు గనక.. ఐఏఎఫ్ చేతికి వస్తే.. భారత్ వద్ద మొత్తం రఫేల్ ఫైటర్ జెట్ల సంఖ్య 176 వరకు పెరుగుతుంది. మరి ఈ డీల్ త్వరలో ఇంప్లిమెంట్ కావాలని కోరుకుందాం.na





















