బాంగ్లాదేశ్ పై శ్రీలంక సూపర్ విక్టరీ.. ఇలా అయితే ఇండియాకి కష్టమే!
0 రన్స్, 2 వికెట్లు.. ఇలాంటి చెత్త బ్యాటింగ్ మనం దాదాపు ఏ టీం నుంచి ఊహించం. అలాగే ఇంత అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కూడా టీమ్స్ నుంచి రావడం చాలా అరుదు. కానీ నిన్న శ్రీలంక, బంగ్లా మ్యాచ్ లో ఇదే సీన్ కనపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆసియా కప్ 2025 సీజన్లో భాగంగా శనివారం బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక యూనిటీ గా ఆడి 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధిస్తే.. బంగ్లా దిక్కుమాలిన ఆటతో చెత్త ఓటమి మూటగట్టుకుంది. బంగ్లా బౌలర్ల దెబ్బకి ఒక్క పరుగు కూడా చేయకుండానే 2 వికెట్లు పారేసుకున్న బంగ్లా టీం ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు పోగొట్టుకుంది. బంగ్లా బ్యాటింగ్ చూస్తే ఒకానొక టైంలో 53/5 స్కోర్ తో అసలు 100 రన్స్ అయినా చేస్తారా అనే డౌట్ వచ్చింది. అయితే జాకెర్ అలి (41), shamin Hossain (42) నిలకడగా ఆడటంతో 20 ఓవర్లలో ఎలాగోలా 139 రన్స్ చేయగలిగింది బంగ్లా టీం. అయితే బౌలింగ్ లో లంక బ్యాటర్ల ముందు బంగ్లా తేలిపోయింది. ఒక్కరంటే ఒక్కరూ కూడా లంక నిస్సాంక, మిషిర ని కట్టడి చేయలేక పోయారు. దీంతో 14.4 ఓవర్లలో 4 వికెట్లు పోగొట్టుకుని 9.54 run rate తో 140 రన్స్ చేసిన శ్రీలంక మ్యాచ్ గెలిచేసింది. ఈ విన్ తో టోర్నీ లో లంక ఓపెనింగ్ అదిరింది. ఇక లంక ఆట తీరు చూస్తే.. సూపర్ 4 లో మనకి చాలా tough fight ఇచ్చే చన్సులున్నాయి. కాబట్టి లంక బౌలింగ్ ని ఎదుర్కునేందుకు మన టీమిండియా ఇప్పటి నుంచే statagies సెట్ చేసుకుంటే బెటర్.





















