BCCI స్పెషల్ ప్లాన్? INDvsPak మ్యాచ్ క్యాన్సిల్!
ఆసియా కప్ 2025 సీజన్లో భాగంగా ఈ రోజు జరగబోతున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆగిపోబోతోందా..? మ్యాచ్ అఫీషియల్‌గా ఆపలేం కాబట్టి.. అనఫీషియల్‌గా బీసీసీఐ ఏమైనా ప్లాన్ చేస్తోందా..? అంటే కొంతవరకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. పెహల్గామ్ ఎటాక్, ఆపరేషన్ సిందూ తర్వాత పాకిస్తాన్‌తో ఎట్టిపరిస్థితుల్లో క్రికెట్ ఆడటానికి వీల్లేదని ఇండియాలో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్తాన్ ఆడబోతున్న మ్యాచ్‌ని కూడా బాయ్‌కాట్ చేయాలని, అసలు ఈ మ్యాచ్‌ని హోస్ట్ చేస్తున్నందుకు ఆసియా కప్‌నే బాయ్‌కాట్ చేయాలని కూడా పిలుపునిస్తూ సోషల్ మీడియా విపరీతంగా పోస్ట్‌లు పెడుతున్నారు. మనందరికీ తెలుసు.. ఆల్రెడీ పాకిస్తాన్‌తో ఇండియా ఎలాంటి బైలేటరల్ టోర్నీలు ఆడటం లేదు. అలాగే రీసెంట్‌గా లెజెండ్స్ లీగ్ టైంలో కూడా పాక్ లెజెండ్స్‌తో ఆఖరి నిముషంలో మ్యాచ్ ఆడకుండా తప్పుకుంది ఇండియా లెజెండ్స్ టీమ్. అయితే ప్రైవేట్ టోర్నీ కావడంతో అది సాధ్యమైంది. కానీ ఆసియా కప్ లాంటి ఇంటర్నేషనల్ టోర్నీలో మేనేజ్‌మెంట్ మ్యాచ్‌ను రద్దు చేయలేదు. అందుకే ఈ మ్యాచ్ ఆడటానికి బీసీసీఐ ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ భారత ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారని అర్థం చేసుకున్న బోర్డు.. ఈ మ్యాచ్‌ని అడ్డుకోవడానికి ఇంటర్నల్‌గా ప్లాన్ చేస్తోందట. ప్లేయర్లందరికీ బీసీసీఐ ముందే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేసిందని.. సరిగ్గా మ్యాచ్‌కి ముందు ఇండియన్ ప్లేయర్లంతా మ్యాచ్ ఆడటానికి ఒప్పుకోకుండా వెనుతిరుగుతారని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వస్తోంది. మరి మ్యాచ్ టైంకి కానీ.. అసలేం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు. మరి మీరేం అంటారు? ఇండియా ఈ మ్యాచ్ ఆడాలంటారా..? లేదంటే క్యాన్సిల్ చేయాలంటారా..?





















