Digital Payments in 2021: క్రెడిట్ కార్డు యూజర్లు కేక! డిజిటల్ చెల్లింపుల మీదే రూ.39,000 కోట్లు ఖర్చు
క్రెడిట్ కార్డు వినియోగదారులు 2021లో వాలెట్లు, డిజిటల్ చెల్లింపుల కోసం ఏకంగా రూ.39,000 కోట్లు ఖర్చుచేశారు. అందులో విహార యాత్రల కోసమే ప్రత్యేకంగా రూ.7,850 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.
డిజిటల్ చెల్లింపులు, వాలెట్ల వాడకం వేగంగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు 2021లో వాలెట్లు, డిజిటల్ చెల్లింపుల కోసం ఏకంగా రూ.39,000 కోట్లు ఖర్చుచేశారు. అందులో విహార యాత్రల కోసమే ప్రత్యేకంగా రూ.7,850 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.
ఇక ఆహారం, యుటిలిటీ బిల్లుల కోసం అన్ని నెలల్లో నిలకడగా డబ్బు ఖర్చు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత జులై నుంచి అక్టోబర్ వరకు ఆహారం, పానీయాలపై విపరీతంగా ఖర్చుపెట్టారని క్రెడిట్ కార్డు బిల్ మేనేజ్‌మెంట్ వేదిక క్రెడ్ తెలిపింది.
'2021ని క్రెడ్ సభ్యుల స్వయం సంరక్షణ ఏడాదిగా మేం ప్రకటిస్తాం! ఎందుకంటే ట్రావెలింగ్, షాపింగ్, ఆరోగ్యం, వెల్‌నెస్‌పై విపరీతంగా ఖర్చు చేశారు. 2022లోనూ మా సభ్యులకు మరింత మెరుగైన అనుభవం అందించేందుకు ప్రయత్నిస్తాం' అని క్రెడ్ స్థాపకుడు కునాల్ షా అన్నారు. కరోనా ఆంక్షలు సడలించగానే చాలామంది పర్యటనలకే మొగ్గు చూపారని ఆయన వెల్లడించారు.
సెప్టెంబర్‌లో ట్రావెల్ క్రెడిట్ కార్డుల ఖర్చు రూ.1103 కోట్లుగా ఉంది. 2021లోని అన్ని నెలలతో పోలిస్తే ఇదే ఎక్కువ. అక్టోబర్లోనూ సభ్యులు రూ.1091 కోట్ల వరకు ఖర్చు చేశారు. మే, జూన్‌లో 24 లక్షల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.675 కోట్లుగా ఉంది. జులై నెలలో పర్యటనలు మొదలవ్వడంతో ఖర్చుల స్థాయి రూ.602 కోట్లకు పెరిగింది. మాల్దీవులు, దుబాయ్‌లో భారతీయులు ఎక్కువగా పర్యటించారు. దేశంలోనైతే గోవా, కూర్గ్, జైపుర్, ఉదయ్‌పుర్, బెంగళూరు, ముంబయిల్లో స్వల్పకాల విహార యాత్రలకు వెళ్లారు.
మార్చి, మే నెలల్లో వ్యక్తులు రూ.1000 కోట్ల మేరకు ఆహారం, పానీయాల మీదే ఖర్చు చేశారు. ఆన్‌లైన్‌లోనే ఫుడ్‌ను ఆర్డర్లు ఇచ్చారు. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేయగానే బయటకు రావడం మొదలైంది. ఆగస్టు (రూ.1750 కోట్లు), సెప్టెంబర్ (రూ.1727 కోట్లు)లో అత్యధికంగా లావాదేవీలు, చెల్లింపులు ఆహారం, పానీయాల మీదే జరిగాయి. అక్టోబర్లోనూ ఇదే ఒరవడి కనిపించింది. ఫిట్‌నెస్‌పై పెట్టే ఖర్చు మరింత పెరిగింది. జనవరి-మార్చిలో ఖర్చు రూ.1152 కోట్లుగా నమోదైంది.
Also Read: Multibagger Stocks: 5 ఏళ్లు.. 10 స్టాక్స్.. రూ.10 లక్షలు పెట్టుబడి.. రూ.1.7 కోట్ల లాభం
Also Read: RBI Penalty on Banks: ఐసీఐసీఐ, పంజాబ్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాకు.. భారీ జరిమానా
Also Read: Cars Price Increase: కొత్త సంవత్సరంలో ఈ కార్ల ధరలు పైకి.. ఈ సంవత్సరమే కొనేయండి!
Also Read: Cryptocurrency: భారత్‌లో క్రిప్టో కరెన్సీ నిషేధంపై IMF చీఫ్ ఎకానమిస్ట్ సంచలన వ్యాఖ్యలు!
Also Read: Health Insurance: తల్లిదండ్రులతో కలిసి ఆరోగ్య బీమా అస్సలు తీసుకోకండి..! ఎందుకంటే..?