By: ABP Desam | Updated at : 19 Dec 2021 10:30 AM (IST)
Edited By: Ramakrishna Paladi
Life Insurance Plan Tips
ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికీ జీవిత బీమా నిత్యావసరంగా మారింది. కుటుంబానికి భద్రత కల్పించేందుకు ఇదో ప్రధాన సాధనంగా మారిపోయింది. చాలా మందికి ఎలాంటి బీమా తీసుకోవాలి? ఎంత మొత్తానికి తీసుకోవాలి? ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? వంటి విషయాల్లో తికమక పడుతుంటారు. అలాంటప్పుడు ఈ విషయాలను పరిశీలించుకుంటే బెటర్!
మీ లక్ష్యాలేంటి?
బీమా తీసుకొనే ముందు ఆలోచించాల్సింది మీ లక్ష్యం ఏంటని! రానున్న సంవత్సరాల్లో మీ అవసరాలను ఎలా ఉంటాయో ఆలోచించి అనువైన బీమాను ఎంచుకోవాలి. బీమా తీసుకొనే వ్యక్తి లక్ష్యాలను అది తీరుస్తుందో లేదో గమనించాలి. అప్పుడే ఉద్యోగం పొంది యువకులు, మధ్య వయస్కులు ఎక్కువ కవరేజీ, తక్కువ ప్రీమియం చెల్లించే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే రిటైర్మెంట్ ప్లాన్ గురించీ ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల నిరంతరం ఆదాయం రావడమే కాకుండా వీడ్కోలు తర్వాత భారీ స్థాయిలో కార్పస్ వస్తుంది.
విశ్లేషించుకోవాలి
మీ అవసరాలు గుర్తించిన తర్వాత సమీప, సుదూర భవిష్యత్తుకు ఉపయోగపడే బీమాను ఎంచుకోవాలి. అందుకోసం మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉన్న బీమా ప్రణాళికలను పరిశోధించి విశ్లేషించుకోవాలి. జీవిత బీమా కవరేజీతో పాటు నిరంతరం ఆదాయం వచ్చే వాటినీ పరిశీలించాలి. ఒకవేళ ఏది ఎంచుకోవాలో తెలియకపోతే మీ అవసరాల జాబితా తీసుకొని నిపుణులను కలిస్తే అనువైన బీమాను ఎంచుకోవచ్చు.
ప్రీమియం గడువూ ముఖ్యమే
పాలసీని గుర్తించాక ప్రీమియం చెల్లించే గడువును ఎంచుకోవాలి. సాధారణంగా టర్మ్ ముగిసిన తర్వాత ప్రీమియం చెల్లిస్తే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల ఆధాపడిన వ్యక్తులకు ఆర్థిక భద్రత లభిస్తుంది. పాలసీ మెచ్యూరిటీ ముగిశాక బీమా మొత్తం అందుతుంది. సరైన సమయంలో ప్రీమియం చెల్లించారు కాబట్టి సులువుగా బీమా మొత్తం ఇచ్చేస్తారు.
ఎంత బీమా తీసుకోవాలి?
సరైన బీమా పాలసీని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో సరైన బీమా మొత్తం ఎంచుకోవడమూ అంతే కీలకం. మానవ జీవితం విలువ (Human Life Value), ఆర్థిక స్థోమత, ఆదాయం, ఖర్చులు, భవిష్యత్తులో బాధ్యతలు, చెల్లించాల్సిన అప్పులను బట్టి బీమా మొత్తం ఎంపిక చేసుకోవాలి. భవిష్యత్తులో మారే లక్ష్యాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. అన్నింటికీ ఒకే బీమా అనేది పనిచేయదు. వ్యక్తిగత, కుటుంబ అవసరాలు, లక్ష్యాలను బట్టి వేర్వేరు బీమా తీసుకోవాల్సి రావొచ్చు.
Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్.. పెరగనున్న పన్ను భారం!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా..
Also Read: Cryptocurrency: భారత్‌లో క్రిప్టో కరెన్సీ నిషేధంపై IMF చీఫ్ ఎకానమిస్ట్ సంచలన వ్యాఖ్యలు!
Work From Office: రమ్మంటే రాజీనామా చేస్తారని ఐటీ కంపెనీల భయం! WFH వదలని ఉద్యోగులు!
Gold Rate Today 26th June 2022: వినియోగదారులకు ఊహించని షాక్లు ఇస్తున్న బంగారం- ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే?
DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!
Gold Rate Today 25th June 2022: పసిడి ప్రియులకు గుడ్న్యూస్, మళ్లీ తగ్గిన బంగారం ధర, నిలకడగానే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
Work From Home Latest News: వర్క్ ఫ్రం హోమ్ను చట్టబద్ధం చేయనున్న అక్కడి పార్లమెంటు!
Ranji Trophy 2022 Final: ఆ కెప్టెన్ 23 ఏళ్ల కల ఇప్పుడు నిజమైంది! రంజీ విజేత మధ్యప్రదేశ్
Bank Fraud: డేటింగ్ యాప్లో అమ్మాయితో లవ్వు! పనిచేస్తున్న బ్యాంకుకే కన్నమేసిన ఉద్యోగి!
Rangamarthanda: 'రంగమార్తాండ' స్టేటస్ - ఆగస్టులో రిలీజ్ పక్కా?
Robot Firefighter: మంటల్ని ఆర్పే రోబోలు వచ్చేశాయ్, ఇక అధికారుల పని సులువే