అన్వేషించండి

YS Jagan: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !

YSRCP: వైఎస్ జగన్ అక్రమాస్తులను జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ED issues orders seizure YS Jagan  illegal assets: జగన్ అక్రమాస్తుల కేసులో చాలా కాలం తర్వాత ఈడీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్  కు చెందిన మొత్తంగా రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాలోని సున్నపురాయి గనుల తవ్వకాల్లో  అక్రమాలు జరిగాయని గతంలో CBI చార్జిషీటు దాఖలుచేసింది. దీనిపై 2013 లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఈడీ కేసులు పెట్టింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ. 150 కోట్ల మేర జగన్ లబ్ధి పొందారని CBI తేల్చింది. CBI చార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ తేల్చి ఇప్పుడు ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  

CBI చార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ తేల్చి ఇప్పుడు ఆస్తులు జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్‌ రూ.150 కోట్ల లబ్ధిని షేర్లు, హవాలా రూపంలో నగదు పొందినట్లు ఈడీ గుర్తించింది. రూ.95కోట్లు రఘురాం సిమెంట్స్‌లో షేర్లు  పొందారు. ఇది తర్వాత భారతి సిమెంట్స్ గా మారింది. రూ.55కోట్లు హవాలా రూపంలో డబ్బు ఇచ్చినట్లు గుర్తించారు.  కడప జిల్లాలోని సుమారు 417 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సున్నపురాయి  గనులను దాల్మియా సిమెంట్స్ సంస్థకు అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ కాలంలో లీజుగా మంజూరు చేశారు. 

జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో దాల్మియా సిమెంట్స్‌ కేసు కీలకమైనది.   కడప జిల్లాలో దాల్మియా సిమెంట్స్‌కు 417 హెక్టార్ల భూమి కేటాయించారు. ఇందులో సున్నపు రాయి ఉంటుంది. ఈ భూములు కేటాయించినందుకు  జగన్‌కు సంబంధించిన సాక్షి మీడియా గ్రూప్ ,  ఇతర సంస్థలలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ కేసు పెట్టింది. దాల్మియా సిమెంట్స్ నుండి వచ్చిన పెట్టుబడులు అక్రమ ఆదాయంగా ఈడీ నిర్ణయించింది.  గతంలో  దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియా తమపై ఉన్న కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 ఎప్పుడూ విచారణకు హాజరు కాలేదు. 2021లో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా  వాయిదా కోరినందుకు హైకోర్టు రోజుకు రూ. 50,000 ఖర్చులు చెల్లించాలని పునీత్ దాల్మియాను ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులన్నీ   ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ,  సీబీఐ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.  సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినప్పటికీ చురుకుగా ముందుకు సాగడం లేదు.  

అయితే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిన పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈడీ ఆస్తులు జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో కేసుల దర్యాప్తులు ఆగిపోయాయి. విదేశాల నుంచి సమాచారం కోసం దర్యాప్తు సంస్థలు ప్రయత్నించాయని చెబుతారు. ఇటీవలి కాలంలో కోర్టుల్లో ట్రయల్ కూడా జరగడం లేదు. అనూహ్యంగా ఈడీ నిర్మయం తీసుకోవడంతో.. ఇక నుంచి కేసుల విచారణ ఊపందుకుంటుందని భావిస్తున్నారు.                       

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Peddi : పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
Embed widget