అన్వేషించండి

KTR News: HCU భూ వివాదంపై రేవంత్ రెడ్డిని విచారిస్తారా? లేదా? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్

KTR Comments: హెచ్సీయూ భూ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో రేవంత్ రెడ్డిని విచారించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రెండూ ఒక్కటేనని ప్రజల్లోకి వెళ్తామని కేసీఆర్ కేంద్రాన్ని హెచ్చరించారు.

KTR Comments On Revanth : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కామెంట్స్ చేసారు. కొత్త ప్రబాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యమన్నారు. చందాలు వసూలు చేసుకొని అయినా డబ్బులు ఇస్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చాలా మంది అనుకుంటున్నారని అన్నారు. అయితే తమకు మాత్రం అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. 

మేం కూల్చాల్సిన పని లేదు: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాగ్రహంతోనే పోతుందని మధ్యలో కూల్చేందుకు తాము కుట్రలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు మాజీ మంత్రి కేటీర్. ఇప్పటికే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పీక్స్‌కు చేరిందని హెచ్చరించారు. మరెన్నో రోజులు భరించే పరిస్థితి లేదని అన్నారు. విదేశాల్లో తిరుగుబాటు వచ్చినట్టు తెలంగాణలో కూడా తిరుగుబాటు వస్తుందని ప్రజలే తరిమేస్తారని హెచ్చరించారు. అంతే తప్ప తాము ఏదో కుట్ర చేసి కుయుక్తి రాజకీయాలు చేయాల్సిన ఖర్ పట్టలేదని అభిప్రాయపడ్డారు. ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని, సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత మరో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు ప్రజలు భయపడతారని విమర్శించారు. 

కేంద్రం ఏం చేస్తోంది? కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏంచేస్తున్నాయి? : కేటీఆర్

కంచ గచ్చబౌలి భూవివాదంలో బీఆర్‌ఎస్ చెప్పిందే సెంట్రల్‌ కమిటీ చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్‌ను ఆయన స్వాగతించారు. సెంట్రల్ కమిటీ చెప్పినట్టు స్వతంత్ర సంస్థలో విచారణ చేస్తే అన్ని బాగోతాలు బయటపడతాయని అభిప్రాయపడ్డారు. ఆ బీజేపీ ఎంపీ సంగతి కూడా వెలుగులోకి వస్తుందన్నారు.  ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకుంటే మాత్రం ఇందులో వారి భాగస్వామ్యం ఉన్నట్టు అనుమాన పడాల్సి ఉంటుందన్నారు కేటీఆర్. రూల్స్‌కు విరుద్దంగా చేస్తున్న పనులపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిపై సీవీసీ, సీబీఐ, ఎస్‌ఎఫ్‌ఐవో, ఆర్బీఐ, సెబీ అన్ని సంస్థలతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలన్నారు. ఏప్రిల్‌ నెలాఖరు వరకు చూస్తామని చర్యలు తీసుకోకుంటే తర్వాత ప్రజాక్షేత్రంలో రెండు పార్టీల సంగతి తేలుస్తామని హెచ్చరించారు. 

నెలాఖరు వరకు టైం: కేటీఆర్

HCUలో వేల చెట్లు నరికేశారని అక్కడ ఉన్న జంతువులకు నిలువ నీడ లేకుండా చేశారని, బడా ఆర్థిక మోసం జరిగిందని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కేంద్రం ఎందుకు స్పందించ లేదని కేటీఆర్ ప్రశ్నించారు. బుల్డోజర్లను అర్ధరాత్రి పంపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేసిందని ప్రవచనాలు చెప్పిన మోడీ... రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి ఎందుకు ఆరాటపడుతున్నారని నిలదీశారు.  

కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే"అధికారం మదంతో అహంకారంతో ఎవరైనా విర్రవీగుతూ నియంతలం, చక్రవర్తులం, రారాజులం అని ఏ రాజకీయ నాయకుడైనా భావిస్తే ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు. ప్రజాస్వామ్యానికి మూలమైన నాలుగు స్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థ దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని గమనిస్తూనే ఉన్నది. సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది. నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి నేతృత్వంలో జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగింది. హెచ్.సి.యులోని 100 ఎకరాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారు? ఎట్లా పునరుద్ధరిస్తారో స్పష్టమైన రోడ్డు మ్యాప్‌తో రాకుంటే అదే స్థలంలో తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి అధికారులను జైలుకు పంపుతాం అని సుప్రీంకోర్టు చెప్పడం ఇంతకుముందెన్నడూ జరగలేదు.

వేరే ఎవరైన అయి ఉంటే రాజీనామా చేసే వాళ్లు: కేటీఆర్

ఆత్మాభిమానం, పౌరుషం, సిగ్గు ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈపాటికి రాజీనామా చేసేవాడు. కానీ అక్కడ ఉన్నది రేవంత్‌రెడ్డి. ఆయనకు సిగ్గు, శరం, ఆత్మాభిమానం ఏమీ లేవు. ఎన్ని విమర్శలు వచ్చినా అన్నింటిని దులుపుకొని బతుకుతున్నాడు. నిన్నటి సుప్రీంకోర్టు ఆదేశాలు హెచ్.సి.యు విద్యార్థులు, ప్రొఫెసర్ల విజయం. ఈ రాష్ట్రం, దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయం 

రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పర్యావరణ విధ్వంసం మీద వివిధ దేశాల్లో ఉండి స్పందించిన ప్రతి ఒక్కరికి, వారికి మద్దతుగా నిలబడ్డ వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సుప్రీంకోర్టుకు కూడా బీఆర్ఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. క్షేత్రస్థాయిలో పర్యటించి అందర్నీ కలిసి వాస్తవాలను సుప్రీంకోర్టుకు నివేదించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీకి మా ధన్యవాదాలు. 
సెంట్రల్ టెంపర్ కమిటీ అనేది సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సాధికారిక కమిటీ. హెచ్.సి.యు భూముల తనఖా విషయంలో బడా ఆర్థిక మోసం జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలకు బలం చేకూరేలా సెంట్రల్ ఎంపవర్ కమిటీ సుప్రీంకోర్టుకు చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చింది.

స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలి: కేటీఆర్

ఆ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన స్థలమే అని ఎంపవర్ కమిటీ తేల్చి చెప్పింది. భూయాజమాన్య హక్కులు తేలేదాకా తనఖా, లీజుతో పాటు అక్కడ కట్టడాలు నిర్మించడాన్ని తక్షణమే ఆపేలా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని సెంట్రల్ ఎంపవర్ కమిటీ చెప్పింది. జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకమైన అరాచకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణకు ఆదేశించాలని ఎంపవర్ కమిటీ సూచించింది. ఆర్బిఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, సిబిఐ, సివిసి  జోక్యం చేసుకోవాలని కొన్ని రోజుల క్రితం నేను విజ్ఞప్తి చేశాను. మా వాదన నిజమే అని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదికతో స్పష్టమైంది. 

మోదీ ప్రవచనాలు చెబుతారు: కేటీఆర్

మోడీ సంవత్సరానికి ఒకసారి మాట్లాడుతారు.తెలంగాణలో రాహుల్, రేవంత్ టాక్స్ వసూలు చేస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని సరిగ్గా సంవత్సరం కిందట 2024 ఏప్రిల్‌లో మోడీ ఆరోపించారు. స్క్వేర్ ఫీట్‌కి 150 రూపాయలు, హైదరాబాదులో బిల్డింగ్ కట్టాలంటే హఫ్తా వసూలు టైపులో అరాచకత్వం చెలరేగుతుందని లోకం కోడేకు వస్తుంది. ఏ బిల్డర్‌ని పక్కకు తీసుకెళ్లి అడిగినా అతను తన గోడు చెప్పుకుంటాడు. ఆర్ఆర్ టాక్స్ అన్న మోడీ మాటలకు వార్షికోత్సవం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఎలాంటి విచారణ లేదు. మళ్లీ సంవత్సరానికి నిద్ర నుంచి మేల్కొన్న మోడీ మళ్ళీ నిన్న మాట్లాడిండు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేస్తుందని హరియాణాలో ప్రవచనాలు చెప్పిండు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అరాచకాలను నిజంగానే ఆపాలని మోడీ అనుకుంటే సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు.? మా పార్టీ తరఫున అన్ని దర్యాప్తు సంస్థలకు ఉత్తరాలు కూడా రాశాం. మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోతే మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. పర్యావరణ పరిరక్షణ పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి వెంటనే సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణకు ఆదేశించాలి. లేదా ఆర్.బి.ఐ, సివిసి, సిబిఐతోపాటు కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరిపించండి. 

రాహుల్ గాంధీ ఎక్కడ?: కేటీఆర్

రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీ ఇక్కడి విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలబడతానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇంత జరుగుతుంటే రాహుల్ ఇటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పల్లెతో మాట కూడా మాట్లాడడంలేదు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి పంపుతున్న నోట్ల కట్టాలతోనే రాహుల్ గాంధీ నోరు తెరవడం లేదు. మరి బిజెపికి ఏం అడ్డం వస్తుంది? మోడీ ఎందుకు మాట్లాడటం లేదు.? వేలాది చెట్లను నరికేశారని అక్కడ ఉన్న జంతువులకు నిలువ నీడ లేకుండా చేశారని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు.? 

రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ఐఐసి ఉద్దేశాల మీద తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని సెంట్రల్ ఎంపవర్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. 1974, 1981, 2006 పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ టీఎస్ ఐఐసీ ఉద్దేశపూర్వకంగానే అక్కడి చెట్లను నరికి వేసింది. ఎన్నో డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఆ 400 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి చెందినదే అని ఎంపవర్ కమిటీ తేల్చింది. ఆ భూమికి హెచ్సీయూ లీగల్ ఓనర్ అని నివేదికలో పొందుపరిచింది.

కేంద్రం చర్యలతో సమాధానం చెప్పాలి: కేటీఆర్

ప్రభుత్వ దుందుడుకు చర్యలతో రాష్ట్ర సంపద, ప్రజల డబ్బులు ప్రమాదంలో పడ్డాయని కమిటీ హెచ్చరించింది. ఆ భూముల్లో ఉన్న చెరువులు కూడా ప్రభుత్వం తాకట్టు పెట్టింది. చెరువును కూడా తాకట్టు పెట్టే వెధవ ప్రభుత్వం ప్రపంచంలో ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. మోడీ డైలాగులు కొడితే సరిపోదు. బిజెపి స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీతో పాటు, బిజెపి ఎమ్మెల్యేలు కూడా ఆందోళనలు చేశారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి మోడీ ఎందుకు ఆరాటపడుతున్నారు.? ఏఐ జనరేటెడ్ వీడియోలని ప్రభుత్వం మూర్ఖపు వాదన చేసింది. కానీ నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయి అవి ఏఐ వీడియోలు కాదు జంతువుల అర్తనాధాలను తాము విన్నామని స్పష్టం చేశారు. రీట్వీట్లు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది. కుక్కల దాడిలో జింకలు చచ్చిపోయిన విజువల్స్ చూసి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అక్కడ వన్యప్రాణులు లేవు గుంటనక్కలు మాత్రమే ఉన్నాయని చెప్పడం వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం. 

పోలీసులను వదిలిపెట్టబోం: కేటీఆర్

మూటల వేట కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలతో అధికారులు బలి పశువులు అవుతున్నారు. ఇవాళ ఐఏఎస్, ఫారెస్ట్ అధికారులు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. తెలంగాణ పోలీసులలోని కొంతమంది రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారు. ఆ కొంతమందికి కూడా ఇదే హెచ్చరిక. మిమ్మల్ని కూడా వదిలిపెట్టం. మీ మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇష్టానుసారం అడ్డమైన కేసులు పెడుతున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదు. 

కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం  కొద్ది రోజులు ఓపికగా ఎదురు చూస్తాం. ఏప్రిల్ 27 తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి మా పార్టీ ప్రతినిధులం వెళతాం ఆధారాలను అందిస్తాం. అప్పుడు కూడా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బిజెపిని ఎండగడతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతుంది బిజెపినే అని ప్రజలకి చెప్తాం యాజమాన్య హక్కులతో నిమిత్తం లేకుండా అటవీ లక్షణాలు ఉన్న ఏ భూమైనా అడవినే అని సుప్రీంకోర్టు 1996లో చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆర్థిక దోపిడీ, ఈ పర్యావరణ విధ్వంసంపై నరేంద్ర మోడీ స్పందించాలి. లేకుంటే ఈ పాపంలో మోడీకి కూడా వాటా ఉందని అనుకోవాల్సి ఉంటుంది. 

నిర్భయంగా చెప్పాను : కేటీఆర్

ఫార్ములా ఈ రేసు విషయంలో నా మీద అడ్డమైన కేసులు పెడితే నేను అధికారులను బలి పశువులుగా చేయలేదు.  విధానపర నిర్ణయం నేనే తీసుకున్న ఎలాంటి బాధ్యత అయినా నేనే తీసుకుంటా అని చెప్పా. రాజకీయం అంటే ఇలా చేయాలి మంచి జరిగితే నాది చెడు జరిగితే అధికారులదే బాధ్యత అని వాళ్లను బలి పశువులు చేయకూడదు. తనది కాని భూమిని టీఎస్ఐఐసి తాకట్టుపెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకోవడం తప్పు కాదా ? యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను మోసం చేయడం బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా? ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని, టీఎస్ఐఐసిని  విచారించకపోతే మోడీ గారిది తప్పు కాదా ?

సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఇందులో కూడా వారికి వాటా ఉందని అనుకోవడం తప్పు అవుతుందా ? హడావుడిగా కుట్రపూరితంగా లోను తీసుకోవడానికి ఒక బ్రోకర్ సంస్థకు 170 కోట్లు చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా ? మార్కెట్ రేట్ కంటే మూడు శాతం ఎక్కువగా 9.5% వడ్డీ రేటుకు లోన్ తీసుకువచ్చి బ్రోకర్ సంస్థకు అనుచిత ఆర్థిక లబ్ధి  చేకూర్చడంపై విచారణ జరపాల్సిన అవసరం లేదా?  ఇందులో మోడీ ప్రభుత్వానికి బాధ్యత లేదా?

దొందూ దొందే : కేటీఆర్

అన్ని రకాల నిబంధనలను తుంగలో తొక్కి పర్యావరణ హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రిపై వెంటనే కేంద్ర సంస్థలు విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నెలాఖరు వరకు స్పందించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదంటే కేంద్ర సంస్థలతో విచారణ జరపాలి. కాంగ్రెస్ హయాంలో సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవారు. ఈడిని తీసుకొచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు సిబిఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే ఈనాడు ఈడిని బిజెపి విచ్చలవిడిగా వాడుతుంది. కాంగ్రెస్ బిజెపి ఢిల్లీ పార్టీలు రెండు దొందు దొందే. ఈ రెండు ఢిల్లీ పార్టీలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి అరాచకాలకైనా పాల్పడతాయి.

రేవంత్ పిరికి సన్నాసి: కేటీఆర్

రాజకీయ ప్రత్యర్ధులపై ఈడీ కేసులు పెడితే కాంగ్రెస్ స్వాగతిస్తుంది తనదాకా వస్తే మాత్రం ఈడి మీద ఆరోపణలు చేస్తుంది. ఇదేం రాజకీయం.? తెలంగాణ పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యం లాగా వ్యవహరిస్తూ ఎక్స్ట్రాలు చేస్తే న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటాం. రేవంత్ రెడ్డి ఓ పిరికి సన్నాసి. దర్శనం వెంకటయ్య అనే ఒక దళిత వృద్ధున్ని తీసుకుపోయి జైల్లో పెట్టించాడు. సోషల్ మీడియా కంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. 

ప్రజలు విమర్శిస్తే ఫీడ్ బ్యాక్ లాగా తీసుకోవాలి. అదే ప్రజాస్వామిక స్ఫూర్తి. ఈ దేశంలో ఆయా రామ్ గయా రాం  ఫిరాయింపుల సంస్కృతిని తీసుకువచ్చింది హర్యానాలో నాటి ఇందిరా గాంధీ. 2004లో కాంగ్రెస్‌తో కలిసి మేం పోటీ చేసాము. 26 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ తరపున గెలిస్తే అందులో పది మందిని కాంగ్రెస్ పార్టీ గుంజుకుంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్. మొన్నటికి మొన్న మా ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ గుంజుకుంది. 

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టాల్సిన అవసరం లేదు. ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి కూలిపోతుంది. రేవంత్ రెడ్డి చేస్తున్న లుచ్చా పనులకు ప్రజలే బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండాలి. రేవంత్ రెడ్డి నే ముఖ్యమంత్రిగా ఉండాలి. అలా అయితే మరో 20 ఏళ్ల వరకు ఎవరు కాంగ్రెస్కు ఓటు వేయరు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన ఎజెండా మాకు లేదు. అవసరమైతే ప్రజలే రోడ్డుకి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఇంతకంటే పెద్ద పెద్ద నియంతల్ని ప్రజలు మట్టిలో కలిపారు." అని విమర్శలు గుప్పించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget