AP Board Result 2022 | AP Inter Results 2022 | BIEAP AP 1st, 2nd Year Result

AP Board Result 2022 | AP Inter Results 2022 | BIEAP AP 1st, 2nd Year Result

AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫలితాలు telugu.abplive.com లో చెక్ చేసుకోవచ్చు.


AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఫలితాలు విడుదల చేశారు. ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెగ్యూలర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల పరిస్థితులతో ఇంటర్ రిజల్ట్స్ విషయంలో ఏపీ సర్కార్ జాగ్రత్త తీసుకుంది.

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌ 4,45,604 రాస్తే 2,41,591 మంది అంటే 54 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,23,455 మంది రాస్తే... 2,58,446 మంది పాస్‌.. అంటే 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 50 శాతం మంది పాస్ అయినట్లు మంత్రి బొత్స వెల్లడించారు.