అన్వేషించండి

Telangana municipal elections 2026: తెలంగాణ పోరులో పవన్ అస్త్రం - బీజేపీ వ్యూహమా? లేక నాయకత్వ లోపమా?

Telangana BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో బీజేపీ ప్రచారం చేయించుకోవాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీకి లీడర్ల కొరత ఉందా..లేకపోతే వ్యూహమా అనే చర్చ జరుగుతోంది.

Pawan is BJP weapon in  Telangana fight:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ తో ప్రత్యేకంగా సమావేశం అయిన తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కిషన్ రెడ్డి ఆయనను ప్రచారానికి ఒప్పించారు.  ఒక జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ, పక్క రాష్ట్రపు నాయకుడిని .. అదీ కూడా పోటీలో ఉన్న పార్టీ నేతను ప్రచారానికి ఆహ్వానించడంపై రాజకీయ  వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి వంటి బలమైన నేతలు ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించడం వెనుక ఆ పార్టీ సొంత నాయకత్వంపై నమ్మకం కోల్పోయిందా? లేక ఇదొక వ్యూహాత్మక అడుగా? అనే చర్చ మొదలైంది. పొరుగు రాష్ట్ర నాయకులపై ఆధారపడటం వల్ల స్థానిక నేతల ప్రాధాన్యత తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది.

పవన్ పొలిటికల్ లీడర్ ప్లస్ క్రౌడ్ పుల్లర్ 

సెలబ్రిటీ ప్రచారకులు ఓట్లను ఎంతవరకు ప్రభావితం చేస్తారనేది ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉంది. గతంలో అనేక ఎన్నికల్లో సినీ గ్లామర్ ఉన్న నేతలు ప్రచారం చేసినా, అవి ఓట్లుగా మారుతాయా అంటే కచ్చితమైన సమాధానం లేదు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయనకు తెలంగాణలో యువతలో భారీ ఫాలోయింగ్ ఉంది. కానీ, ఆ ఫాలోయింగ్ బీజేపీ అభ్యర్థుల బాక్సుల్లో ఓట్లుగా మారుతుందా? లేక కేవలం సభలకు జనాలను రప్పించడానికే పరిమితమవుతుందా? అన్నది చూడాలి. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పవన్ మద్దతు బీజేపీకి కొంత ప్లస్ అయినప్పటికీ, అప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలు వేరు.

పవన్ ప్రచారంతో బీజేపీకి కొన్ని సవాళ్లు 

తెలంగాణలో  స్థానికత  అనేది ఎప్పుడూ ఒక సున్నితమైన అంశం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వంటి వారు ఇప్పటికే పవన్‌ను  ఆంధ్ర నాయకుడు అని ముద్ర వేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత చేసిన కొన్ని వ్యాఖ్యలను విపక్షాలు ఇప్పుడు అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. ఇటీవల దిష్టి పేరుతో పవన్ చేసిన వ్యాఖ్యలనూ బయటకు తీస్తున్నారు.  పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలను శాసించాలని చూడటం తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ అనే వాదనను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీనిని ఎదుర్కోవడం బీజేపీ-జనసేనకి ఒక సవాలుగా మారనుంది.

కార్పొరేషన్లలో సెటిలర్ల ఓట్లు కీలకం 

బీజేపీ వ్యూహం ప్రకారం..  నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లో సెటిలర్ల ఓట్లు , యువత ఓట్లు కీలకం. ఈ వర్గాలను ఆకర్షించడంలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది.  ఒక జాతీయ భావజాలం ఉన్నప్పుడు ప్రాంతీయ సరిహద్దులు అడ్డంకి కాదు  అని బీజేపీ సమర్థించుకుంటోంది. అయినప్పటికీ, తెలంగాణ మట్టి వాసన తెలిసిన, ఇక్కడి సమస్యలపై పోరాడే  సొంత నేత ప్రచారానికి నాయకత్వం వహిస్తే వచ్చే మైలేజ్ వేరుగా ఉంటుంది. కేవలం సెలబ్రిటీలపైనే ఆధారపడితే, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ డీలా పడే ప్రమాదం కూడా ఉంది.

పవన్ కళ్యాణ్ ప్రచారం బీజేపీకి గ్లామర్ తీసుకురావచ్చు కానీ, అది కేవలం  క్రౌడ్ పుల్లర్ గానే మిగిలిపోతుందా లేదా 'గేమ్ ఛేంజర్' గా మారుతుందా అనేది ఫలితాలే తేలుస్తాయి. రాజకీయాల్లో నేతలకు కావాల్సింది ప్రచారం కంటే ముఖ్యమైనది స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలతో ఉన్న అనుబంధం. ఈ ఎన్నికలు అటు పవన్ కళ్యాణ్ క్రేజ్‌కు, ఇటు తెలంగాణ బీజేపీ నాయకత్వ పటిమకు ఒక అగ్నిపరీక్షగా నిలవనున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget