అన్వేషించండి

Amaravati Railway Line : అమరావతి రైల్వే లైన్ రూట్ మ్యాప్ ఇదే ! ఎన్ని స్టేషన్లు, బడ్జెట్ ఎంతంటే?

Amaravati Railway Line : అమరావతి రైల్వే లైన్ రూట్ మ్యాప్ ఎక్కడ ప్రారంభమవుతుంది. ఎక్కడ వరకు ఉంటుంది. ఏయే స్టేషన్లను టచ్ చేస్తుంది. ఇంతకీ ఎంత బడ్జెట్‌తో రూట్ పూర్తి అవుతుంది లాంటి వివరాలు ఇక్కడ చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమరావతి మీదుగా 57 కి.మీ. రైల్వే లైన్, రూ. 2047 కోట్ల వ్యయంతో రానుంది.
  • ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త స్టేషన్లతో అమరావతి లైన్ ఏర్పాటు కానుంది.
  • 2029 నాటికి నిర్మాణం పూర్తి, భూసేకరణపై రైల్వే శాఖ ఆధారపడి ఉంది.
  • రాష్ట్ర, రైల్వే శాఖల మధ్య చర్చలు, భూసేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

Amaravati Railway Line : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మీదుగా ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం ఓకే చెప్పింది. అయితే దాని రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అనే దానిపై చాలా మందికి క్లారిటీ లేదు. వాటికి స్పష్టత ఇచ్చేలా ABP దేశం ఇస్తున్న exclusive డీటెయిల్స్ ఇవి.

57కిలోమీటర్ల పొడవు... 2047కోట్ల ఖర్చు 

అమరావతికి ప్రత్యేక లైన్ 08.11.24న శాంక్షన్ అయింది. దీని పొడవు 56.53 కిలోమీటర్లు (దాదాపు 57కిలోమీటర్లు). ఈ ప్రాజెక్ట్‌కి అయ్యే ఖర్చు 2047.40కోట్లు. ఈ బడ్జెట్ మొత్తం రైల్వే శాఖ భరిస్తుంది. కానీ భూమిని మాత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది.

ఎర్రుపాలెం నుంచి నంబూరు స్టేషన్ల మధ్య రానున్న అమరావతి రైల్వే లైన్, కొత్తగా వచ్చే స్టేషన్స్ ఇవే.

అమరావతి రైల్వే లైన్ ప్రస్తుతం  మధిర -విజయవాడ లైన్‌లోని ఉన్న ఎర్రుపాలెం స్టేషన్ నుంచి విజయవాడ -గుంటూరు లైన్‌లో ఉన్న నంబూరు స్టేషన్ వరకూ సపరేట్‌గా రానుంది. ఈ లైన్ రాజధాని గ్రామాల గుండా సాగనుంది. ఎర్రుపాలెం -నంబూరు మధ్య పెదపురం, చెన్నారావు పాలెం,గొట్టుముక్కల, పరిటాల,కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం స్టేషన్‌లు కొత్తగా ఏర్పడనున్నాయి. రాష్ట్రప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలపడంతో భూసేకరణ జరగగానే ఈ లైన్ ఏర్పాటు పనులు ప్రారంభించనుంది రైల్వే శాఖ. ఈ లైన్ పూర్తి అయితే అమరావతి నుంచి ఎర్రుపాలెం మీదుగా హైదరాబాద్.. నంబూరు మీదుగా విజయవాడ,వైజాగ్,గుంటూరు, చెన్నై,బెంగుళూరు లాంటి మార్గాలకు కనెక్టివిటీ రానుంది.

ఎప్పటికి పూర్తవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు 2029 జనవరి కల్లా అమరావతి రైల్వే లైన్ పూర్తి కావాలని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి రైల్వేకి అప్పగిస్తారు అనే దానిపై ఆధారపడి అమరావతి రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అవుతుందని అని నిపుణులు చెబుతున్నారు

ఇప్పటికే ప్రభుత్వంతో రైల్వే చర్చలు 

ఏపీ సీఎం చంద్రబాబుతో ఇప్పటికే విజయవాడ DRM సహా రైల్వే అధికారులు పలుమార్లు భేటీ అయ్యారు. అమరావతి రైల్వే లైన్‌ఫై రాష్ట్రప్రభుత్వం, రైల్వే శాఖ క్లారిటీతో ఉన్నాయి. మరోవైపు అమరావతి రైల్వే స్టేషన్‌ను భారీగా నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నా దానికి పెద్ద ఎత్తున భూమి కావాలి. దానికోసం ప్రస్తుతం భూసేకరణ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రైల్వే లైన్ ఖర్చు మాత్రం రైల్వే శాఖదే. ఈ లైన్ మధ్య కొన్ని బ్రిడ్జ్ లు కూడా నిర్మించాల్సి ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా ప్రభుత్వం భూ సేకరణ జరిపి ఇస్తే అంత త్వరగా పనులు మొదలు పెట్టడానికి రైల్వే రెడీగా ఉంది.

Frequently Asked Questions

అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ ఎప్పటినుండి మంజూరు చేయబడింది?

అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ 08.11.24న మంజూరు చేయబడింది. ఈ ప్రాజెక్ట్‌కి అయ్యే ఖర్చు 2047.40కోట్లు. రైల్వే శాఖ మొత్తం బడ్జెట్‌ను భరిస్తుంది.

అమరావతి రైల్వే లైన్‌ను ఎవరు నిర్మిస్తారు మరియు భూసేకరణ బాధ్యత ఎవరిది?

ఈ ప్రాజెక్ట్‌ను రైల్వే శాఖ నిర్మిస్తుంది మరియు మొత్తం బడ్జెట్‌ను అదే భరిస్తుంది. అయితే, భూసేకరణ బాధ్యత మాత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే.

అమరావతి రైల్వే లైన్‌కు సంబంధించిన కొత్త స్టేషన్లు ఏవి?

ఈ లైన్‌లో పెదపురం, చెన్నారావు పాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం స్టేషన్‌లు కొత్తగా ఏర్పడనున్నాయి.

అమరావతి రైల్వే లైన్‌ను ఎప్పటిలోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు?

రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, 2029 జనవరి కల్లా అమరావతి రైల్వే లైన్ పూర్తి కావాలని భావిస్తున్నారు. అయితే, ఇది భూసేకరణ వేగంపై ఆధారపడి ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget