అన్వేషించండి

Telangana municipal elections 2026: ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ - పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న గులాబీ దళం

Municipal elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉత్తర తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది.

BJP vs Congress in North Telangana:  ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి ఉమ్మడి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. గత అసెంబ్లీ ,  పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, ఈ ప్రాంతంలో బీజేపీ బలంగా పుంజుకోగా, అధికార కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఉన్న  బీఆర్ఎస్  ఇప్పుడు తీవ్రమైన నైరాశ్యంలో కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతుండటం, కేసీఆర్ వంటి అగ్రనేతలు మున్సిపల్ ఎన్నికలపై పెద్దగా దృష్టి సారించకపోవడం వల్ల గులాబీ దళం డీలా పడినట్లు  భావిస్తున్నారు.

ఉత్తర తెలంగాణలో గెలుపు పార్టీలకు కీలకం 
 
ఉత్తర తెలంగాణలోని ప్రధాన పట్టణాలు ఇప్పుడు ఎన్నికల రణక్షేత్రాలుగా మారాయి. ఈసారి ఎన్నికలు జరుగుతున్న మొత్తం  7 మున్సిపల్ కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లు కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం  ఈ ప్రాంతానికే చెందినవి కావడం విశేషం. వీటితో పాటు ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సుమారు  35కు పైగా మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో పట్టు సాధించడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేసుకోవాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పావులు కదుపుతున్నాయి.

స్వయంగా రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి 
 
ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి, కీలక మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు, బీజేపీ  జాతీయ నాయకత్వం హిందుత్వ కార్డును బలంగా వాడుకుంటోంది. ఎంపీలు  బండి సంజయ్ , ధర్మపురి అరవింద్  తమ నియోజకవర్గాల్లోని కార్పొరేషన్లను గెలవడం తమకు ప్రతిష్ఠాత్మకమని భావిస్తూ వార్డుల వారీగా పర్యటిస్తున్నారు. రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. 

బీఆర్ఎస్ డీలా పడటానికి కారణాలేంటి? 

బీఆర్ఎస్ పార్టీలో మునుపటి జోష్ కనిపించడం లేదు. మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాలకే పరిమితం కావడం, పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకత్వం లోపించడం ఆ పార్టీని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ద్విముఖ పోటీ నెలకొంది. కవిత పార్టీని వీడటం బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగా మారింది. చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు మూడో స్థానానికి పరిమితమయ్యే ప్రమాదం ఉందని  విశ్లేషణలు వస్తున్నాయి.    ఫిబ్రవరి 11న జరగనున్న ఈ ఎన్నికలు ఉత్తర తెలంగాణలో ఎవరి బలం ఎంతో తేల్చనున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్ల పట్టణ ఓటర్లు మొగ్గు చూపుతారా? లేక పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చినట్లుగానే బీజేపీకి పట్టం కడతారా? అన్నది వేచి చూడాలి.                          

టాప్ హెడ్ లైన్స్

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
YSRCP MLA Disqualification Issue: అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget