అన్వేషించండి

Rajagopal Reddy: మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana News | కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఆఫర్ చేసిందని, కానీ సీనియర్ నేత జానారెడ్డి అందుకు అడ్డు తగులుతున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చౌటుప్పల్: మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ తనకు హామీ ఇచ్చిందని, ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రిని చేస్తామని మళ్ళీ హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) తెలిపారు. నాకు మంత్రి పదవి రాకుండా సీనియర్ నేత జానారెడ్డి (Jana Reddy) అడ్డుపడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్లో యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహిస్తే లేనిది, ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇద్దరు ఇస్తే తప్పా అని ప్రశ్నించారు.

మంత్రి పదవి అలంకారం కాదు బాధ్యత..

యాదాద్రి జిల్లా చౌటుప్పల్, నల్గొండ జిల్లా చండూరులలో ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్త. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తుంది. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, కెపాసిటిని బట్టి వస్తుంది. అయితే 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి నేడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చింది.

ఎంపీగా గెలిపిస్తే మంత్రి పదవి అని మళ్లీ ఆఫర్ చేశారు

హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో మంత్రులకు ఇంఛార్జ్ బాధ్యతలు ఇచ్చిన ఎంపీలు గెలవలేదు, కానీ భుననగిరిలో ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎంపీని గెలిపించా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గద్దె దింపాలని లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేసి చూపించా. అది నా కమిట్మెంట్. నా మంత్రి పదవి విషయంలో జానారెడ్డి లాంటి వ్యక్తులు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే కాలర్ ఎగరేసుకొని ఉంటాడే తప్పా, అడుక్కునే పొజిషన్లో ఎప్పుడూ ఉండడు. పార్టీలో పైరవీలు చేసే వారిని పక్కనపెట్టాలి. ప్రజల కోసం, అభివృద్ధి కోసం పనిచేసే వారికి పదవులు ఇవ్వాలి. ప్రజలకు పనికొచ్చే మనిషికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంటే కొంచెం బాధగా ఉంది. నేను వాళ్ల వింటానో, లేదోనని కొందరు భయపడుతున్నారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ కుటుంబ పార్టీ

రాజగోపాల్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. మంత్రి పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు అంతా మంచి చేయాలి. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పరిధిని పెంచి రైతులకు ఇంకా మంచి చేసేందుకు కృషి చేస్తా. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న సంకల్పంతోటి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నపుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ. రాచరికంతో కొనసాగిన పార్టీ, వారికి దండాలు పెట్టిన వారికే మంత్రి పదవులు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ.

కరెంటు గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ కొంతమంది రైతులకు ఇవ్వాల్సి ఉంది అది వాస్తవమే. డబుల్ బెడ్ రూమ్ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పేదలను మోసం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తుంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పాలయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీరు అందించే బాధ్యత రాజగోపాల్ రెడ్డిదే. ప్రభుత్వం పెట్టిన సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది.

చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్  గోపాల్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తదిదర కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajagopal Reddy: మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి,  రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
IPL 2025 DC VS MI Result Update: గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs MI Match Highlights IPL 2025 | ఢిల్లీపై 12 పరుగుల తేడాతో ముంబై సంచలన విజయం | ABP DesamRR vs RCB Match Highlights IPL 2025 | రాజస్థాన్ పై 9వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamTravis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajagopal Reddy: మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి ఆఫర్ చేశారు, కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నారు- రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి,  రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
IPL 2025 DC VS MI Result Update: గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
గెలుపుబాట పట్టిన ముంబై.. రాణించిన తిలక్, కర్ణ్ శర్మ, కరుణ్ పోరాటం వృథా.. ఢిల్లీకి తొలి ఓట‌మి
KTR : ఒకే తప్పును మళ్లీ చేయవద్దు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఒకే తప్పును మళ్లీ చేయవద్దు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anna Konidela: తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ
తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ
Bharat Gourav Train: విజయవాడ నుంచి తెలంగాణ, హరిద్వార్, రిషికేశ్, కలుపుతూ వైష్ణోదేవి, అమృత్ సర్ కు అమృత్ గౌరవ్ ట్రైన్
విజయవాడ నుంచి తెలంగాణ, హరిద్వార్ రిషికేశ్, కలుపుతూ వైష్ణోదేవి, అమృత్ సర్ కు అమృత్ గౌరవ్ ట్రైన్
Telugu TV Movies Today: రజినీకాంత్ ‘శివాజీ’, చిరంజీవి ‘ముఠామేస్త్రి’ టు బాలయ్య ‘వీరసింహా రెడ్డి’, రవితేజ ‘నేనింతే’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 14) టీవీలలో వచ్చే సినిమాలివే..
రజినీకాంత్ ‘శివాజీ’, చిరంజీవి ‘ముఠామేస్త్రి’ టు బాలయ్య ‘వీరసింహా రెడ్డి’, రవితేజ ‘నేనింతే’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 14) టీవీలలో వచ్చే సినిమాలివే..
Embed widget