Viral News: కొడుకు ఆపరేషన్ తండ్రికి చేసేశారు - రాజస్తాన్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
Rajasthan Hospital: రాజస్థాన్ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. కుమారుడికి ప్రమాదం జరిగితే అతనికి ఆపరేషన్ చేయకుండా తండ్రికి చేసేశారు.

Rajasthan Hospital Blunder : రోగం ఒకటి అయితే చికిత్స మరొకటి చేసే వైద్యుల్ని చాలా మందిని చూసి ఉంటారు. అలాగే ఓ కాలుకు దెబ్బతగిలితే మరో కాలుకు ఆపరేషన్ చేసిన వారిని కూడా చూసి ఉంటాం. కానీ రాజస్థాన్ లోని కోటా మెడికల్ కాలేజీ డాక్టర్లు అందరి రికార్డులను బద్దలు కొట్టారు. ఓ మనిషి బదులు మరో మనిషికి ఆపరేషన్ చేసేశారు.
రాజస్థాన్ లోని కోటాలో మనీష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో అతన్ని కోటా ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి గట్టిగా దెబ్బలు తగిలాయని ఆపరేషన్ చేయాలని వైద్యులు తేల్చారు. చూసుకోవడానికి ఓ మనిషిని పిలిపించుకోమని సలహా ఇచ్చారు. దాంతో మనీష్ తన తండ్రిని పిలిపించుకున్నారు. అయితే మనీష్ తండ్రికి అప్పటికే పెరాలసిస్ ఉంది. అయినా కుమారుడ్ని చూసుకోవడానికి వచ్చాడు. అయితే ఎంత సేపటికి ఆపరేషన్ చేయలేదు. కానీ తర్వాత జరిగిందేమిటో తెలుసుని షాక్ కు గురయ్యాడు.
राजस्थान के कोटा संभाग के सबसे बड़े मेडिकल कॉलेज अस्पताल की सुपर स्पेशलिटी विंग में अस्पताल प्रशासन की गंभीर लापरवाही के चलते बेटे के इलाज के लिए आए पिता की भी डॉक्टर ने सर्जरी कर दी। उनके हाथ में चीरा लगाकर 6 से 7 टांके लगा दिए।#Rajasthan #Kota
— Hindustan (@Live_Hindustan) April 17, 2025
यहां पढ़ें पूरी खबर -… pic.twitter.com/0Tfrgh04K0
ప్రమాదంలో గాయపడ్నని సహాయం చేయడానికి మరెవరూ లేరని అందుకే పెరాలసిస్ తో బాధపడుతున్నప్పటికీ తన తండ్రిని నాతో రమ్మని అడిగానన్నారు. తన తండ్రి ఆపరేషన్ ధియేటర్ బయట వేచి ఉన్నారని.. ఏమైందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నాన్న శరీరంపై 5–6 కుట్లు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. అతను పక్షవాతం వచ్చిన రోగే కానీ ఆ ఆస్పత్రిలో చేరలేదు.అయినా ఆపరేషన్ చేశారు. ఈ అంశంపై కోటా మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీత సక్సేనా, ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి 2-3 రోజుల్లో నివేదిక అందించమని నేను సూపరింటెండెంట్‌ను కోరాను. ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశాను... వారు దర్యాప్తు చేసి విషయాన్ని వెల్లడిస్తారన్నారు.
#WATCH | Rajasthan: Principal, Kota Medical College Hospital, Dr. Sangeeta Saxena, says, "... I have asked the superintendent to form a committee and submit a report within 2-3 days. They have formed a three-member committee... They will inquire and inform what happened..."… pic.twitter.com/p3SFK9rZRz
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 17, 2025
వారు నిరక్ష్య రాస్యులు కావడావడంతో.. తన తండ్రికి ఏం ఆపరేషన్ చేశారో కూడా అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.





















