Waqf Bill: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
Supreme Court: వక్ఫ్ బిల్లు అమలుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Supreme Court imposed status quo on the Waqf Bill : వక్ఫ్ బిల్లు విషయంలో యథాతథ స్థితిని పాటించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సంజీవన్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. పూర్తి వివరాలు దాఖలు చేసేందుకు అటార్నీ జనరల్ వారం రోజుల గడువు అడిగారు. అప్పటి వరకూ ఏమీ మార్పులు ఉండవన్నారు. దీంతో సుప్రీంకోర్టు అప్పటి వరకూ బిల్లులో ఎలాంటి మార్పు లేదా.. చట్టం పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది.
కేంద్రం ప్రభుత్వం తరపున ఎస్ జి తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అనేక సవరణలు,కమిటీల ఏర్పాట్లు,లక్షల సంఖ్యలో అభ్యర్థనలు ఉన్నాయని .. గ్రామాలకు గ్రామాలను వక్ప్ ఆస్తులుగానూ, వ్యక్తిగత ఆస్తులను తీసుకున్నారని వాదించారు. ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ స్టే ఇవ్వడం కఠినమైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. ఒక వారం సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అలాగే తన వాదనలతో పాటు డాక్యుమెంట్లను సమర్పించడానికి సైతం అనుమతించాలని విజ్జప్తి చేశారు.
VIDEO | Delhi: Advocate Barun Sinha on Supreme Court hearing on Waqf (Amendment) Law, says, "The first interim order is that there will be no appointment in Waqf Council or Waqf Board as per the amended law till the next date of hearing. The second thing that honourable court… pic.twitter.com/u5iYmv2Ox8
— Press Trust of India (@PTI_News) April 17, 2025
పరిస్థితి మారిపోవాలని కోరుకోవడం లేదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఐదేళ్ల వరకు ప్రొవిజెన్స్ ఉన్నాయని తమకు తెలుసునని వాటిని తాము స్టే చేయడం లేదని స్పష్టం చేశారు. దయ చేసి తమ వాదనను వినాలని కోరారు. ఒక వారం రోజుల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. అలాగే తాము ఎలాంటి నియామకాలు చేయమని ధర్మాసనానికి విన్నవించారు. తదుపరి విచారణ వరకు ఎలాంటి మార్పులు ఆదేశించారు. ఏ రాష్ట్రం అయినా.. నియామకాలు చేస్తే.. అవి చట్టబద్దమైనవిగా పరిగణించకూడదన్నారు. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వారం రోజులు సమయం ఇచ్చింది.
#WATCH | Delhi | On SC hearing on Waqf Amendment Act, Advocate Barun Kumar Sinha says, "The Supreme Court didn't put a stay. The Solicitor General of India said that no appointment will be made either in the council or in the board under the new amendment act. The Supreme Court… pic.twitter.com/lRpBPgojgz
— ANI (@ANI) April 17, 2025
అలానే తదుపరి విచారణ తేదీ వరకు ఎలాంటి నియామకాలు జరగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక తదుపరి విచారణ తేదీ వరకు.. యూజర్ వై వక్ఫ్‌గా పర్కొన్నవాటితోపాటు నోటిఫికేన్ ద్వారా రిజిస్టర్ చేయబడినవి.. డీ నోటిఫై చేయకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.





















