అన్వేషించండి

Waqf Amendment Act 2025:అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 - నోటిఫికేష్ జారీ చేసిన కేంద్రం 

Waqf Amendment Act 2025: పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి సంతకం చేసిన చట్టం రూపం దాల్చిన వక్ఫ్‌ సవరణ బిల్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

Waqf Amendment Act 2025: వక్ఫ్ (సవరణ) చట్టం 2025 ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు (ఏప్రిల్ 8,2025) నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టంలోని సెక్షన్ 1(2) కింద జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, చట్టంలోని నిబంధనలు ఏప్రిల్ 8, 2025నుంచి అమలులోకి వచ్చే తేదీగా  నిర్ణయించింది. ఏప్రిల్ 4న పార్లమెంటు ఆమోదించిన చట్టం ఏప్రిల్ 5న రాష్ట్రపతి ఆమోదం పొందింది.

అనేక రాష్ట్రాల్లో నిరసనలు 
కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతుండగా, కాంగ్రెస్, AIMIM, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వేర్వేరు పిటిషన్లతో సుప్రీంకోర్టులో దీనిని సవాలు చేశాయి. కేంద్రప్రభుత్వం ప్రకారం, ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదు. వక్ఫ్ ఆస్తుల పక్షపాతం, దుర్వినియోగాన్ని నిరోధించడమే దీని ఉద్దేశ్యం. లోక్‌సభలో, వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. కాగా, రాజ్యసభలో, బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి.

సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు 
ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఇప్పటివరకు మొత్తం 15 పిటిషన్లు దాఖలయ్యాయి. ఏకపక్ష ఉత్తర్వు వచ్చే అవకాశాన్ని నివారించడానికి కేంద్రప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. మణిపూర్, పశ్చిమ బెంగాల్, పాట్నాతో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.

వక్ఫ్ చట్టంపై జమాతే-ఇ-ఇస్లామీ హింద్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ తెరిచింది. జమాతే-ఇ-ఇస్లామీ హింద్ అధ్యక్షుడు సయ్యద్ సదాతుల్లా హుస్సేనీ మాట్లాడుతూ, "వక్ఫ్ చట్టం దేశంలోని ముస్లింలకు వ్యతిరేకం. ఈ చట్టం వక్ఫ్ పరిపాలనను మెరుగుపరచడంలో సహాయపడదని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

"ఈ చట్టం సంస్కరణలను తీసుకువస్తుందని ప్రభుత్వం చెబుతోంది, కానీ దానిలో మార్పులు మరిన్ని సమస్యలకు దారి తీస్తాయని మేము నమ్ముతున్నాము. పరిపాలనను మరింత దిగజార్చే, అవినీతిని పెంచే, ముస్లింల హక్కులను హరించే నిబంధనలు ఈ చట్టంలో చేర్చారు" అని ఆయన అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget