అన్వేషించండి

AP DSC 2025: ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?

AP DSC 2025: వారం రోజుల్లో డీఎస్సీ 2025 వేయనున్న ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. ఈసారి అప్లికేషన్ దశలోనే సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేయనుంది.

AP DSC 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి డీఎస్సీని పక్కా ప్రణాళికతో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి దరఖాస్తులను రెండు విభాగాలుగా స్వీకరించబోతున్నారని తెలుస్తోంది. డీఎస్సీకి అప్లై చేయాలనుకునే వాళ్లు కచ్చితంగా కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. లేకుంటే తప్పులో కాలు వేస్తారు. అంతే కాకుండా అన్ని సర్టిఫికెట్లు కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. దరఖాస్తు టైంలోనే వాటిని అప్‌లోడ్ చేయాలి. 

సాధారణంగా డీఎస్సీలో విజయం సాధించిన తర్వాత పోస్టింగ్ తీసుకునే టైంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్, పాఠశాల ఎంపికను పూర్తి చేస్తారు. కానీ ఈసారి ముందుగానే పాఠశాల ఎంపికను ఇస్తున్నారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే టైంలోనే మీరు ప్రభుత్వం, పురపాలక, పంచాయతీరాజ్‌, ఆదర్శపాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమ శాఖ నిర్వహించే పాఠశాల్లో దేనిలో ఆసక్తి  చూపిస్తారో చెప్పాల్సి ఉంటుంది. దీనికి ప్రయార్టీ ఇస్తారు. దీని ఆధారంగా మీరు డీఎస్సీలో ఎంపికైన తర్వాత పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మార్చుకోవడానికి వీలు ఉండదు. దీన్ని డీఎస్సీ అప్లికేషన్ పార్ట్‌ ఏలో పెడుతున్నారు. 

ఇక పార్ట్ బీలో మీ వివరాలు నమోదు చేసి సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏడో తరగతి నుంచి బీఈడీ వరకు అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. దీంతోపాటు కుల, పీహెచ్‌, ధ్రువీకరించే సర్టిఫికెట్లను కూడా సిద్ధం చేసుకోవాలి. అందుకే ముందుగానే వీటిని సిద్ధం చేసుకోవడం ఉత్తమం అని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ ఆఫీసులు కిక్కిరిసిపోతాయని అంటున్నారు. ముందుగానే అప్లై చేసుకొని సద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.  

మొదటి నుంచి చెబుతున్నట్టుగానే 16,347 ఉద్యోగాలతో నార్మల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ మధ్య ప్రకటించిన 2,260 ప్రత్యేక విద్య టీచర్ పోస్టులను తర్వాత భర్తీ చేస్తారు. ఈ రెండింటిని కలపడం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రిపేర్ అయ్యేందుకు స్పెషల్ బీఈడీ విద్యార్థులకు సమయం ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయనుంది. 

టెట్ పెట్టి చాలా కాలం అవుతున్నందున రెండూ కలిపి నిర్వహించాలని డిమాండ్ అభ్యర్థుల నుంచి వస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం డీఎస్సీ మాత్రమే నిర్వహించాలని చూస్తోంది. ఇప్పటికే ఆలస్యమైనందున రెండింటినీ కలిపే ఆలోచన లేనట్టుగానే చెబుతోంది.  

టాప్ హెడ్ లైన్స్

ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget