AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Andhra Pradesh DSC Notification | ఏపీలో త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు.

Nara Lokesh On AP DSC Notification | అమరావతి: ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. మరో 5 రోజుల్లో DSC నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు 16,347 పోస్టుల DSC నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. సాధ్యమైనంత త్వరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. SC వర్గీకరణ ప్రక్రియ పూర్తైన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్, టీచర్ పోస్టుల భర్తీపై ముందుకెళ్లామని ఆగడంతోనే ఆలస్యమైందని నారా లోకేష్ చెప్పారు. ఎస్సీ కమిషన్ రిపోర్టుపై ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, 2 రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
2,260 కొత్త టీచర్ పోస్టులకు ప్రభుత్వం అనుమతి
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 2,260 పోస్టులను క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 1,136 స్పెషల్ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ఖాళీలను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (AP DSC) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి దోహదం చేయనుంది. ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు టీచింగ్ చేయనున్నారు. విద్యను బోధించడానికి వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణ సైతం ఇస్తుంది.
| జిల్లాలు | ఎస్‌జీటీ పోస్టులు | స్కూల్ అసిస్టెంట్ పోస్టులు |
| అనంతపురం | 101 | 100 |
| చిత్తూరు | 117 | 82 |
| తూర్పుగోదావరి | 127 | 151 |
| గుంటూరు | 151 | 98 |
| వైఎస్ఆర్ కడప | 57 | 49 |
| కృష్ణా | 71 | 89 |
| కర్నూలు | 110 | 130 |
| శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | 63 | 44 |
| ప్రకాశం | 74 | 50 |
| శ్రీకాకుళం | 71 | 109 |
| విశాఖపట్నం | 59 | 52 |
| విజయనగరం | 45 | 66 |
| పశ్చిమ గోదావరి | 90 | 105 |
వైసీపీ హయాంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్న లోకేష్
గత వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ వేయలేదని, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని మంత్రి నారా లోకేష్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో పేర్కొన్నారు. గత 30 ఏళ్లలో టిడిపి హయాంలో 13 డిఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి, వాటి ద్వారా ఏకంగా 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేసినట్లు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ లో సైతం 2014-19 కాలంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంలో సైతం మూడు డిఎస్సీలు నిర్వహించి 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసినట్లు పేర్కొన్నారు.






















