Pawan Kalyan: పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !
Tirumala: పవన్ కల్యాణ్ గోశాల పర్యటన వాయిదా పడింది. అనారోగ్యమే కారణమని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Pawan Kalyan Tour postponed: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల,తిరుపతి పర్యటన వాయిదా పడింది. ఇంతకు ముందు నిర్ణయించిన షెడ్యూల్ శుక్రవారం ఆయన తిరుపతికి వెళ్తాల్సి ఉంది. ముందుగా గోశాలను పరిశీలిస్తారని.. తరవాత శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్తారని జనసేన వర్గాలు చెప్పాయి. గోశాల అంశం రాజకీయంగా వివాదాస్పదమయింది. మూడు నెలల్లో వంద గోవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో దుమారం రేగింది. టీటీడీ కూడా తీవ్రంగా స్పందించింది. గతంలో గోశాల పట్ల ఎలా వ్యవహరించారో.. ఇప్పుడు ఎలా నిర్వహణ ఉందో వివరాలను ఈవో బయట పెట్టారు.
గోశాలపై విస్తృతంగా జరుగుతున్న రాజకీయం
గురువారం రోజు కూడా గోశాల విషయంలో రాజకీయం జరిగింది. భూమనపై మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చలో గోశాల వివాదస్పదమయిదంి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ గోశాలను సందర్శించాలని నిర్ణయించుకోవడం ఆసక్తి రేపింది. అయితే ఆయన పర్యటన అనారోగ్యం కారణంగా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో గోశాలను పరిశీలించిన తరవాత నేరుగా శ్రీవారిని కూడా శనివారం దర్శించుకోవాలని అనుకున్నారు. ఇటీవల తన కుమారుడు సింగపూర్ లో అగ్నిప్రమాదం నుంచి బయట పడటంతో మొక్కులు తీర్చుకోవాలని అనుకుంటున్నారు.
శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాలనుకున్న పవన్
ఇప్పటికే పవన్ సతీమణి అన్నా లెజ్ నోవా తిరుమలలో మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కు అనారోగ్యంగా ఉండటంతో ముందుగా ఆమె వెళ్లారు. పవన్ కేబినెట్ సమావేశానికి కూడా అనారోగ్య కారణంతో వచ్చి వెళ్లిపోయారు. అనారోగ్యంతోనే పవన్ కల్యాణ్ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సైలెన్ ఎక్కించుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆరోగ్యం కుదట పడకపోవడంతో.. ఆయన తిరుమల, తిరుపతి పర్యటనను వాయిదా వేసుకున్నారు. వచ్చే వారంలో ఈ పర్యటన ఉండే అవకాశం ఉందని బావిస్తున్నారు.
పవన్ కు గోవులపై ప్రత్యేక అభిమానం
గోవులంటే పవన్ కు ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఫామ్ హౌస్‌లో చాలా వరకూ గోవుల్ని పోషిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు గోశాలపై వచ్చిన ఆరోపణల్ని స్వయంగా పరిశీలించాలని అనుకుంటున్నారు. వైసీపీ నేతలు మత విద్వేషాలు పెట్టాలనుకుంటున్న తీరుపై ఆయన విరుచుకుపడే అవకాశం ఉందని అనుకున్నారు. ప్రస్తుతానికి ఆయన అనారోగ్యంతో వైసీపీ నేతలకు విమర్శలు తప్పినట్లే. విశ్రాంతి, తదుపరి చికిత్స కోసం పవన్ కల్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్ళారు. వచ్చే వారం తిరుపతి పర్యటన ఖరారు అయ్యే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ పని ఒత్తిడి కారణంగా ఇటీవలి కాలంలో తరచూ అనారోగ్యనికి గురవుతున్నారు.



















