Fake Dog Man: రూ.50 కోట్ల ఖరీదైన కుక్కను కొన్నానని ప్రచారం - ఈడీ వచ్చేసరికి బండారం బట్టబయలు - కమెడియనా? మోసగాడా?
Bengaluru: బెంగళూరులో ఓ వ్యక్తి తాను రూ.50 కోట్ల విలువైన కుక్కను కొన్నానని ప్రచారం చేసుకున్నాడు. తీరా ఈడీ అడుగు పెట్టేసరికి అతని బండారం అంతా బట్టబయలు అయింది.

ED probes Bengaluru breeder who bought Rs 50 crore wolfdog: యాభై కోట్ల రూపాయల విలువ చేసే ఊల్ఫ్ డాగ్‌ను కొన్నానని సతీష్ అనే వ్యక్తి ప్రచారం చేసుకున్నాడు. మీడియా, సోషల్ మీడియాలో అంతా నిజమేనని నమ్మారు. కానీ అసలు విషయం మాత్రం ఈడీ ఎంటరయ్యాకనే తెలిసింది.
ఎస్ సతీష్ అనే వ్యక్తిగా ఈడీ దాడులు చేసింది. అతను యాభై కోట్లు పెట్టి కుక్కను కొన్నానని ప్రచారం చేసుకున్నాడు. దీంతో అతనిపై ఈడీ దృష్టి పడింది. అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎలా చెల్లించావో చెప్పాలని ఆయన వద్దకు ఈడీ పోయింది. తాను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఊల్ఫ్ డాగ్ ను రూ. 50 కోట్లకు కొన్నానని ఆయన మీడియాకు చెప్పారు. కాడాబాంబ్ ఒకామి అని పిలువబడే అరుదైన హైబ్రిడ్ అడవి తోడేలు , కాకేసియన్ షెపర్డ్ మధ్య సంకరం ద్వారా ఆ కుక్క పుట్టిందని నమ్మంచాడు. ఆ కుక్క వీడియోలు వైరల్ అయ్యాయి కానీ ఈడీ ఎంటరయ్యే సరికి అసలు నిజం బయటపడింది.
యాభై కోట్లు పెట్టి కొన్నానని ఆయన చెప్పుకున్నాడు కానీ అది లోకల్ కుక్కేనని ఈడీ గుర్తించింది. సతీష్ ఇతర కుక్కల పెంపకందారుల నుండి తీసుకొని వైరల్ వీడియోలను సృష్టిస్తున్నాడు. కోట్ల రూపాయలకు విదేశీ విదేశీ జాతులను కొనుగోలు చేసినట్లు తప్పుగా చెబుతున్నాడని ED తెలిపింది. అతని ఆర్థిక, ఆదాయ వనరులు , GST రికార్డులను పరిశీలించిన తర్వాత అతనికి అంత సామర్థ్యం లేదని గుర్తించింది. ఆ కుక్కను దిగుమతి చేసుకోలేదు. చట్టబద్ధమైన దిగుమతి పత్రాలు లేవు . అతను విదేశీ జాతులు అని నమ్మించే కుక్కలన్నీ లోకల్‌వేనని గుర్తించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు అధికారులు సతీష్‌పై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
Bengaluru’s 50-Crore Wolfdog Turns Out to Be a Phantom Pet—ED Lands in a Hoax Hole
— Sudhakar Udumula (@sudhakarudumula) April 17, 2025
What began as a dramatic twist in India’s exotic pet world ended in a deadpan anticlimax on Thursday when officials from the Enforcement Directorate (ED) walked into a Bengaluru… pic.twitter.com/MeowYBHKvL
సతీష్ ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు. ఈ సంస్థను కూడా ఆయనే పెట్టుకున్నారు. కుక్కలంటే కాస్త ఆసక్తి ఉన్నట్లుగా నటిస్తూ ఉంటాడు. ఇతరుల కుక్కుల్ని తీసుకుని ఎగ్జిబిషన్లు పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉటాడు. ఈవెంట్లలో కుక్కలతో షో ఏర్పాటు చేసినందుకు డబ్బులు వసూలు చేస్తాడు. ఈ కుక్క చాలా అరుదు, ప్రజలు దీన్ని చూడటానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు అని చెప్పి నమ్మించి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ ఉంటారు.
ఇప్పటి వరకూ అతను ఇలాగే చాలా మందిని మోసం చేసి చాలా పెద్ద మొత్తాలకు కుక్కలను అంటగట్టాడన్న ఆరోపణలు వస్తున్నాయి.





















