DC vs MI Match Highlights IPL 2025 | ఢిల్లీపై 12 పరుగుల తేడాతో ముంబై సంచలన విజయం | ABP Desam
ఊహించని ట్విస్టులు, అదిరిపోయే షాకులు..సినిమాను తలపించే హీరోయిక్ ఫర్ ఫార్మెన్సులు, నరాలు తెగిపోయే ఉత్కంఠతో క్లైమాక్స్ లు. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ మాత్రం ఓ అబ్సల్యూట్ సినిమాను తలపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. రికెల్టన్, సూర్య షో
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణయం తప్పు అనిపించేలా ముంబై బ్యాటర్లు దుమ్మురేపారు.ప్రధానంగా రోహిత్ శర్మ ధాటిగా ఆడే ప్రయత్నంలో రెండు ఫోర్లు, ఓ సిక్సు బాది 18 పరుగులకే అవుటైపోయినా...ర్యాన్ రికెల్టన్, సూర్య కుమార్ యాదవ్ మాత్రం ఓపికగా ఆడారు. రికెల్టన్ 25 బాల్స్ లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 41పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయితే..స్కై 28 బాల్స్ లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 40 పుగులు చేసి అదే కుల్దీప్ బౌలింగ్ లో అవుటైపోయాడు. కానీ అప్పటికే టీమ్ స్కోరు 13 ఓవర్లలో 135 పెట్టి పది రన్ రేట్ ను మెయిన్ టైన్ చేశారు
2. తిలక్ వర్మ కసి
తనను స్లోగా ఆడుతున్నావని ఓమ్యాచ్ లో విమర్శించారనే కసిని ఇప్పటికీ చూపిస్తున్నారు తిలక్ వర్మ. 33 బాల్స్ లోనే 6 ఫోర్లు 3 సిక్సర్లతో 59 పరుగులు చేసిన తిలక్ ముకేశ్ బౌలింగ్ లో అవుటైపోయాడు కానీ లేదంటే ముంబై మరింత భారీ స్కోరే పెట్టది. చివర్లో నమన్ ధీర్ 17 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సులతో 38 పరుగులు చేసి మంచి క్యామియో ఆడటంతో ముంబై 205పరుగుల స్కోరు చేసి ఢిల్లీకి 206పరుగుల టార్గెట్ పెట్టింది.
3. కుల్దీప్ యాదవ్ మాస్
ఢిల్లీ బౌలర్ల గురించి చెప్పుకోవాలంటే కుల్దీప్ యాదవ్ మాస్ బౌలింగ్ తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అది కూడా మంచి టచ్ లో కొచ్చి 41 పరుగులు చేసిన రికెల్టన్ ని క్లీన్ బౌల్డ్ చేసి కుల్దీప్...త్వాత సూర్య కుమార్ యాదవ్ ను 40 పరుగులకే ఔట్ చేసి ముంబై మరీ భారీ స్కోరు కొట్టకుండా ఇద్దరు సెట్ బ్యాటర్ ల వికెట్లు తీశాడు కుల్దీప్ యాదవ్.
4. జెర్సీ సినిమా కరుణ్ నాయర్
206 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కి ఫస్ట్ బాల్ కే షాక్. దీపక్ చాహర్ బౌలింగ్ లో జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ డకౌట్ అయ్యాడు. అయితే అభిషేక్ పోరల్ తో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ దుమ్ము రేపాడు. ఎవరనేగా...కరుణ్ నాయర్ ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. హా అతనే సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో 300పరుగులు చేసి 2016లో ఓ సెన్సేషన్ ను క్రియేట్ చేసి కరుణ్ నాయరే. 2022 తర్వాత కనీసం ఐపీఎల్ ఆడే అవకాశమే కోల్పోయిన కరుణ్ నాయర్..మూడేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కి ఈరోజు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ధూం ధాం చేశాడు. మూడు నాలుగేళ్లుగా రంజీల్లో, విజయ్ హజారే ట్రోఫీల్లీ తాను చూపిస్తున్న కసినంతా ఈ రోజు ఈ ఒక్క మ్యాచ్ లో పెట్టి కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లు 5 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. శాంట్నర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిపోయి సెంచరీ మిస్సయ్యాడు కానీ లేదంటే గ్రేటెస్ట్ కమ్ బ్యాక్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ గా మిగిలిపోయేవాడు.
5. మ్యాచ్ తిప్పేసిన కర్ణ్ శర్మ, శాంట్నర్
కరుణ్ నాయర్ అంతటి మ్యాచ్ విన్నింగ్స్ ఆడినా కేఎల్ రాహుల్ తో పాటు తర్వాత వచ్చిన వాళ్లెవరూ పట్టుమని ఇరవై పరుగులు కూడా కొట్టకపోవటంతో ఊహించని ఢిల్లీకి షాక్స్ తగిలాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముంబై స్పిన్నర్లు కర్ణ్ శర్మ, మిచెల్ శాంట్నర్ గురించి. మ్యాచ్ మొత్తం ఢిల్లీ వైపు ఉన్న టైమ్ లో అభిషేక్ పోరల్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ ను అవుట్ చేసి గేమ్ లోకి ముంబైని తెచ్చాడు. మరో వైపు శాంట్నర్ కూడా కరుణ్ నాయర్, విప్రాజ్ లను వికెట్స్ తీయటంతో పాటు..చివరి ఓవర్ లో ముంబై ఫీల్డింగ్ గురించి చెప్పుకోవాలి. పవర్ ఫుల్ హిట్టర్ అశుతోష్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ లను వరుసగా మూడు బాల్స్ లోముగ్గురిని రనౌట్ చేసి 193 పరుగులకే ఢిల్లీని ఆలౌట్ చేయటం ద్వారా 12 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది ముంబై ఇండియన్స్.
ఈ సీజన్ లో ఢిల్లీకి ఇది తొలి ఓటమి కాగా..ముంబై కి ఇది రెండో విజయం.




















