Hyderabad Crime News: పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేని అమ్మ నరికేసింది - హైదరాబాద్‌లో దారుణం - ఎంత కష్టం వచ్చిందో ?
Kids Murder: హైదరాబాద్‌లో ఇద్దరు పిల్లల్ని నరికి చంపిన తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్లలో సంచలనం సృష్టించింది.

Mother commits suicide after killing two children: అమ్మంటే తన పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేదు. అలాంటిది చంపాలని అనుకుంటుందా ?. అది కూడా అత్యంత కిరాతకంగా నరికి చంపాలనుకుంటుందా ?. అసలు అనుకోదు.కానీ ఈ అమ్మ మాత్రం అదే పని చేసింది. హైదరాబాద్‌లోని జీడిమెట్లోల నివాసం ఉంటున్న ఓ మహిళ తన ఇద్దరు కుమారులను కొడవలితో నరికేసింది. వారిలో ఒకరికి ఐదేళ్లు, మరొకరికి ఏడేళ్లు. పిల్లలను చంపేసిన తర్వాత ఆమె సమీపంలోని ఓ భవనం పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం సంచలనం సృష్టించింది.
చనిపోయిన తల్లి పేరు తేజగా గుర్తించారు. ఆమె జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ లేఔట్ లో సహస్ర మహేష్ హైట్స్ అనే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఆమె వయసు ముఫ్పై ఏళ్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు పిల్లల పేర్లు హర్షిత్ రెడ్డి, ఆసీష్ రెడ్డి. వీరిద్దరిని కొబ్బరిబోండం నరికే కత్తితో నరికేసింది. హర్షిత్ రెడ్డి అక్కడిక్కడే చనిపోయాడు.. రెండవ అబ్బాయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. తర్వాత తేజ కూడా ఆమె కూడా 6 వ అంతస్తునుండి దూకి చనిపోయింది.
ఇంత దారుణానికి ఆమె ఎందుకు ఒడి గట్టిందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సన్నిహితులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి పిలిపిస్తున్నారు. ఆమె భర్త గురించి వాకబు చేస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం.. కుటుంబపరమైన సమస్యల కారణంగా ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.



















