Ambedkar Jayanthi : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే
Dr B R Ambedkar Jayanthi : అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విద్య, చేసిన పోరాటాలు, మతంపై ఆయనకున్న విజన్ వంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Ambedkar Jayanti 2025 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన జరుపుకుంటున్నాము. ఈ స్పెషల్ డేని జాతీయ సెలవు దినంగా చేసుకుంటారు. అయితే అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని విద్య, ఉద్యమాలు వంటి అంశాలపై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను, పర్సనల్ లైఫ్ గురించిన ఫ్యాక్ట్స్‌ను ఓసారి చూసేద్దాం.
అంబేడ్కర్ వ్యక్తిగత జీవితం
అంబేడ్కర్ ఏప్రిల్ 14వ తేదీన 1891లో మహారాష్ట్రలోని అంబవాదే గ్రామంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రాంజీ అంబేడ్కర్. ఇది కేవలం పూర్తి పేరేనని.. ఆయన అసలు పేరు అంబదావేకర్ అని చెప్తారు. ఆయన స్వగ్రామమైన అంబవాదే అనే పేరు నుంచి అంబదావేకర్ వచ్చినట్లు చెప్తారు. స్కూల్లో ఓ గురువు ఆయన పేరును అంబేడ్కర్‌గా మార్చారు.
అంబేడ్కర్ విద్య
ఎకనామిక్స్‌లో పీహెచ్‌డి చేసిన మొదటి భారతీయుడు అంబేడ్కర్. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆయనకు ఎకనామిక్స్‌లో డాక్టరేట్స్ వచ్చాయి. ఇలా డబుల్ డాక్టరేట్ పొందిన అరుదైన వ్యక్తిగా అంబేడ్కర్ ప్రసిద్ధి చెందారు.
కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో 29 కోర్సులు, చరిత్రలో 11 కోర్సులు, సోషియాలజీలో 6 కోర్సులు, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పొలిటిక్స్‌లో 3, ఎలిమంట్రీ ఫ్రెంచ్‌లో 1, జెర్మనీలో 1 కోర్సులు చేశారు.
పనిగంటల్లో మార్పు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1935లో ప్రారంభించారు. ఆ సమయంలో ఆర్బీఐ ప్రారంభంలో ఈయన కీ రోల్ ప్లే చేశారు. వైస్రాయ్ కౌన్సిల్‌లో కార్మిక సభ్యుడిగా ఉంటూ పని గంటలను 14 నుంచి 8 గంటలకు తగ్గించారు.
హిందూ కోడ్ బిల్లు
మహిళల హక్కులకు బలమైన మద్ధతునిస్తూ.. మూడు సంవత్సరాల పోరాడి హిందూ కోడ్ బిల్లు రూపకల్పనలో కృషి చేశారు. 1924లో బహిష్కృత హితకారిణి సభ అనే సంస్థను స్థాపించి శిక్షణ, విద్యాభివృద్ధి కోసం కృషి చేశారు. 1927లో మహద్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. రాజ్యంగా రూపకల్పన కమిటీకి అంబేడ్కర్ అధ్యక్షత వహించారు. భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం వంటి ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు.
దళితుల హక్కుల కోసం పోరాటం
దళితుల హక్కుల కోసం ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆలయాల్లో ప్రవేశాలకు, జనజీవన అవసరాలపై ఉద్యమాలు చేశారు. అంటరానితనం నిర్మూలన, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాటం చేశారు. అంబేడ్కర్ ఆటోబయోగ్రఫీ అయిన Waiting for Visaలో అంటరానితనం (Untouchbility) వల్ల ఆయన ఎదుర్కొన్న విషయాల గురించి ప్రస్తావించారు. కొలంబీయా యూనివర్సిటీలో ఈ బుక్‌ని టెక్స్ట్బుక్గా ఉపయోగిస్తున్నారు. Annihilation of Caste, The Buddha and His Dhamma, The Problem of the Rupee వంటి ప్రముఖ పుస్తకాలు కూడా ఆయన రాశారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం నేర్పించే మతం ఆయనకు నచ్చుతుందంటూ 1956లో బౌద్ధమతాన్ని స్వీకరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

