TS Inter Supplementary Exam Date 2025: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ డేట్స్ ప్రకటించిన భట్టి విక్రమార్క
TS Inter Supplementary Exam: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ లో 66.89 శాతం, సెకండియర్ లో 71.37 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వచ్చే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

TS Inter Supplementary Exam: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 66.89 శాతం పాస్ కాగా, సెకండియర్ లో 71.37 శాతం మంది పాసయ్యారని వెల్లడించారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని విద్యాశాఖ కార్యదర్శి, ఐఏఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
సప్లిమెంటరీ పరీక్షలపై అప్‌డేట్
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ఫలితాల సమయంలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలపై అప్ డేట్ ఇచ్చారు. మే 22వ తేదీన సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అవుతాయని విద్యార్థులు జాగ్రత్తగా ప్రిపేర్ కావాలని భట్టి విక్రమార్క సూచించారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి జూర్ 6 వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు ఫీజులు చెల్లించుకునేందకు అవకాశం కల్పించారు.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9 లక్షల 97 వేల 12 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పాస్ పర్సంటేజ్ 66.89 శాతం కాగా.. సెకండియర్ పాస్ పర్సంటేజ్ 71.37 శాతంగా ఉంది. ఫస్టియర్, సెకండియర్ లో బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరం బాలికలు పాస్ పర్సంటేజ్ 73.83 శాతం కాగా, బాలుర పాస్ పర్సంటేజ్ 57.83 శాతం ఉంది. సెకండియర్ లో బాలికలు పాస్ పర్సంటేజ్ 74.21 శాతం కాగా, బాలుర పాస్ పర్సంటేజ్ 57.21 శాతానికే పరిమితమైంది.






















