అన్వేషించండి
Oats Omelette Recipe : ఓట్స్ ఆమ్లెట్ రెసిపీ.. పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌కి బెస్ట్ ఆప్షన్
Protein Rich Breakfast : పోషకాలతో కూడిన ఆహారంతో రోజును ప్రారంభించాలనుకునేవారికి ఓట్స్ ఆమ్లెట్ బెస్ట్ ఆప్షన్. మరి దీనిని రుచిగా, సులభంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
ఓట్స్ ఆమ్లెట్ రెసిపీ (Image Source : Envato)
1/7

జిమ్‌కి వెళ్లేవారే కాదు.. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ ఆమ్లెట్‌ని తీసుకోవచ్చు. మరి దీనిని ఇంట్లోనే ఎలా హెల్తీగా, టేస్టీగా చేసుకోవాలో చూసేద్దాం.
2/7

అరకప్పు రోల్డ్ ఓట్స్, 2 ఎగ్స్, ఉల్లిపాయ పావు కప్పు, టొమాటో పావు కప్పు, పచ్చిమిర్చి 1, క్యాప్సికమ్ పావు కప్పు, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి పావు టీస్పూన్, పసుపు పావు టీస్పూన్, 2 టేబుల్ స్పూన్ల నీరు లేదా పాలు, 1 టీస్పూన్ నెయ్యి సిద్ధం చేసుకోవాలి.
3/7

ఓట్స్‌ని నీళ్లు లేదా పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మీరు క్రంచీ ఫ్లేవర్ కోసం నేరుగా గ్రైండ్ చేయకుండా కూడా ఉపయోగించవచ్చు.
4/7

ఓట్స్‌ను మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని గుడ్లు, తరిగిన కూరగాయలు, ఉప్పు, మిరియాల పొడి, పసుపు వేసి బాగా కలపాలి.
5/7

స్టౌవ్ వెలిగించి పాన్ వేడి చేసి.. నాన్‌స్టిక్ లేదా ఐరన్ పాన్‌పై నూనె వేసి మంట మీడియం ఉంచాలి.
6/7

ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని పాన్ మీద పోసి సమంగా పరచండి. దానిపై మూత పెట్టి 2–3 నిమిషాలు ఉడికించాలి.
7/7

మరోవైపు తిప్పి.. మూత లేకుండా 1 లేదా 2 నిమిషాలు బంగారు రంగు వచ్చే వరకు కుక్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ.
Published at : 13 Apr 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















