అన్వేషించండి
Rava Vada Recipe : కరకరలాడే రవ్వ వడలు.. వర్షాకాలంలో టేస్టీగా, ఈజీగా చేసుకోగలిగే బెస్ట్ రెసిపీ
Monsoon Recipe : తక్కువ సమయంలోనే రుచికరమైన టేస్టీ వంటకం తినాలని ఉందా ? అయితే మీరు రవ్వతో చేసిన ఈ వడలను ట్రై చేయండి. రెసిపీ కూడా పదిహేను నిమిషాల్లో అయిపోద్ది.
వర్షాకాలంలో సింపుల్గా చేసుకోగలిగే వడలు (Image Source : Freepik)
1/6

తక్కువ సమయంలో రుచికరమైన వంటకం తయారు చేయాలనుకుంటే.. వర్షానికి తగ్గట్లు కరకరలాడే రవ్వ వడను ట్రై చేయవచ్చు.
2/6

దీనిని తయారు చేయడానికి ఒక గిన్నెలో రవ్వ, పెరుగు, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం అన్ని ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. జీలకర్ర, బేకింగ్ సోడా, ఉప్పు కూడా వేసి కలపాలి.
3/6

ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన ఉంచాలి. అప్పుడు రవ్వ మెత్తబడుతుంది. ఈలోపు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచి వేయించుకోవడానికి సరిపడా నూనె వేయాలి.
4/6

వడలకు తగ్గట్లు పిండి ఉందేమో చెక్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కొంచెం నీరు జల్లుకోవచ్చు. ఇప్పుడు మిశ్రమాన్ని మరోసారి బాగా కలుపుకుని చిన్న చిన్న వడలుగా చేసుకొని వేడి నూనెలో వేయించుకోవాలి.
5/6

వడలు బంగారు రంగులోకి మారిన తర్వాత ప్లేట్లోకి తీసి.. వేడి వేడి చట్నీ లేదా సాంబార్ తో కలిపి సర్వ్ చేసుకోవచ్చు.
6/6

ఈ రెసిపీని ఫాలో అయితే అతి తక్కువ సమయంలో మీరు రుచికరమైన వంటకం తయారు చేసుకోవచ్చు. స్కూళ్ల, ఆఫీస్‌లకు తీసుకెళ్లేందుకు కూడా అనువైనవి.
Published at : 21 Jul 2025 08:08 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















