అన్వేషించండి
Rava Ponganalu : తక్కువ సమయంలో చేసుకోగలిగే రవ్వ పొంగనాలు రెసిపీ.. క్రిస్టీగా, టేస్టీగా చేసేయండిలా
Rava Ponganalu Recipe : వర్షాకాలంలో రుచికరమైన పొంగనాలు తినాలనుకుంటే ఎలాంటి పిండి లేకుండా సింపుల్గా చేసుకోగలిగే టేస్టీ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం.
రవ్వ పొంగనాలు రెసిపీ (Image Source : Freepik)
1/6

వర్షాకాలంలో ఉదయాన్నే ఏమైనా టేస్టీగా తినాలనుకుంటే మీరు రవ్వతో చేసుకోగలిగే టేస్టీ, క్రిస్పీ గుంట పొంగనాలు ట్రై చేయవచ్చు. తక్కువ సమయంలో తయారుచేసే రెసిపీని చూసేద్దాం.
2/6

రవ్వ పొంగనాలు తయారు చేయడానికి.. ముందుగా ఒక గిన్నెలో రవ్వ తీసుకోండి. దీనిలో పెరుగు, నీరు వేసి పేస్ట్ లా తయారు చేసుకోండి.
3/6

15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేయాలి. రవ్వ నానిన తర్వాత దానిలో పసుపు, ఇంగువ, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి.
4/6

పిండిని మరీ గట్టిగా కాకుండా కాస్త పల్చగా కలపండి. ఇలా చేస్తే పొంగనాలు బాగా ఉబ్బుతాయి. ఇప్పుడు పొంగనాల పాన్‌లో నూనె లేదా నెయ్యి వేసి ఒక స్పూన్‌తో పిండిని పాన్‌లో వేయాలి.
5/6

పొంగనాలు రెండు వైపులా బాగా ఉడికించి బంగారు రంగులోకి మారేలా చూసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసి కొబ్బరి చట్నీతో తినొచ్చు.
6/6

మీకు నచ్చితే కూరగాయలను కూడా పిండిలో కలుపుకోవచ్చు. సన్నగా తరిగిన కూరగాయ ముక్కలను పొంగనాలు వేసేందుకు తరిగి.. తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
Published at : 29 Jul 2025 06:15 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















