అన్వేషించండి
Oats Payasam Recipe : ఆరోగ్యానికి మేలు చేసే ఓట్స్ పాయసం రెసిపీ.. స్వీట్ క్రేవింగ్స్‌ని కూడా దూరం చేస్తుంది
Oats Payasam : ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ తినాలనుకుంటే దానిలో ఓట్స్ కచ్చితంగా ఉంటుంది. అయితే మీరు స్వీట్ క్రేవింగ్స్తో ఇబ్బంది పడుతుంటే ఈ ఓట్స్‌తో తియ్యని రెసిపీ చేసుకోవచ్చు.
ఓట్స్ పాయసం రెసిపీ (Image Source : Freepik)
1/6

స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయా? అలాగే మీరు డైట్లో కూడా ఉన్నారా? అయితే మీరు ఈ ఓట్స్ పాయసం ట్రై చేయండి. ఇది పండుగల సమయంలో కూడా స్వీట్ క్రేవింగ్స్‌ని దూరం చేసి హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.
2/6

ఓట్స్ పాయసం తీపి వంటకం అయినప్పటికీ.. దానిలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనికోసం మీరు పంచదారకు బదులుగా బెల్లం లేదా స్టీవియాను ఉపయోగించవచ్చు.
3/6

పాయసం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా జీడిపప్పులను కొద్దిగా నెయ్యిలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
4/6

అదే పాన్‌లో మల్టీగ్రెయిన్ ఓట్స్ వేయండి. వాటిని టోస్ట్ చేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత పాలు పోసి కలపండి.
5/6

చిక్కబడే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, బెల్లం తురుము లేదా స్టీవియా వేసి బాగా కలిసేలా చూసుకోవాలి.
6/6

చివరిగా నెయ్యి వేసి కలపండి. అంతే పాయసం రెడీ. ఓట్స్ పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని జీడిపప్పుతో అలంకరించి.. వేడిగా లేదా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు.
Published at : 23 Jul 2025 08:43 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















