అన్వేషించండి
Masala Dosa : మసాలా దోశ రెసిపీ.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఇలా వేసేయండి
Masala Dosa Recipe : దోశను చాలామంది ఇష్టంగా తింటారు. అయితే ఎంత ఇంట్లో చేసుకున్న బయట దొరికే దోశ రుచే వేరు. దానికి చాలామంది అభిమానులు ఉంటారు. మరి ఆ రుచితో ఇంట్లో దోశలు ఎలా వేసుకోవచ్చో తెలుసా?
మసాలా దోశ రెసిపీ(Image Source : Freepik)
1/6

మీరు కూడా ఇంట్లోనే రెస్టారెంట్ లాంటి రుచితో దోశని చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ రెసిపీ మీకోసమే. ఈ రెసిపీ సహాయంతో మీరు అద్భుతమైన మసాలా దోశని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
2/6

ముందుగా మీరు బియ్యం, మినపప్పును కనీసం 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. అదనంగా మెంతులను 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
3/6

బాగా నానిన తర్వాత ఆ మూడింటినీ మిక్సర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసి 8 నుంచి 10 గంటలపాటు పులియబెట్టాలి.
4/6

ఆలు మసాలా కోసం.. ముందుగా బంగాళాదుంపలను కుక్కర్‌లో ఉడికించి.. తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేసి, కరివేపాకు వేసి, మెత్తగా చేసిన బంగాళాదుంపలను కలపండి. దీనిలో నచ్చిన మసాలా దినుసులు వేసుకుంటే కర్రీ రెడీ.
5/6

పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసి.. నాన్ స్టిక్ తవాపై కొద్దిగా నూనె వేసి.. ఈ పిండిని దోశగా వేసుకోవాలి. దోశను బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
6/6

దోశ తయారైన తరువాత.. దానిపై ముందుగా తయారుచేసుకున్న ఆలూ మసాలాను దోశపై చెంచాతో వేసి ఓ నిమిషం ఉంచి రోల్ చేస్తే మసాలా దోశ రెడీ.
Published at : 22 Jul 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















