Manchu Manoj : 'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
David Reddy Movie : చరిత్రలో బయటకు రాని కొన్ని సంఘటనలే 'డేవిడ్ రెడ్డి' మూవీ అని హీరో మంచు మనోజ్ తెలిపారు. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Manchu Manoj About David Reddy Movie : 'డేవిడ్ రెడ్డి' మూవీ అభిమానులకు ఫుల్ మీల్స్ అవుతుందని రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పీరియాడికల్ మూవీ 'డేవిడ్ రెడ్డి' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
గెస్ట్ రోల్‌లో రామ్ చరణ్... మనోజ్ రియాక్షన్
ఈ మూవీలో గెస్ట్ రోల్స్‌లో రామ్ చరణ్, శింబు కనిపిస్తారనే ప్రచారం సాగుతుండగా దీనిపై మనోజ్ రియాక్ట్ అయ్యారు. ఈ కథలో గెస్ట్ రోల్స్ ఉండే అవకాశం ఉందని... అయితే ఇప్పటివరకూ ఏ హీరోను కూడా సంప్రదించలేదని అన్నారు మనోజ్. 'నన్ను హీరోగా అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి స్టోరీనే హనుమ రెడ్డి రెడీ చేశారు. 1897 నుంచి 1992 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. మూవీని ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ పెట్టి వెంకట్ రెడ్డి, భరత్ ప్రొడ్యూస్ చేశారు.' అని తెలిపారు.
డేవిడ్ రెడ్డి... వెరీ పవర్ ఫుల్
ఈ పీరియాడికల్ మూవీలో తనది వెరీ పవర్ ఫుల్ క్యారెక్టర్ అని మంచు మనోజ్ తెలిపారు. 'డేవిడ్ రెడ్డి బ్రిటీష్ వారికే కాదు ఇండియన్స్ కూడా శత్రువే. డేవిడ్ రెడ్డికి పీస్ ఫుల్‌గా ఉండటం రాదు, ఏదైనా వెళ్లి కొట్టి తెచ్చుకోవడమే తెలుసు. ఇలాంటి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి నాతో మూవీ చేస్తున్న డైరెక్టర్ హనుమకు థ్యాంక్స్. డేవిడ్ రెడ్డి బైక్ పేరు వార్ డాగ్, అతని చేతులో ఉన్న స్టిక్ పేరు డెత్ నోట్. ఇవి రెండూ అతని ఆయుధాలు.
ఇండియాకు స్వాతంత్ర్యం అడిగి కాదు కొట్టి తెచ్చుకోవాలనేది డేవిడ్ రెడ్డి దృక్పథం. బ్రిటీష్ వాళ్లు ఊళ్లకు ఊళ్లు తగలబెడుతుంటే ఆ హింసను హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా కనిపిస్తాడు. ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్‌కు అవకాశం ఉంది. అయితే మేము ఇప్పటివరకు ఏ హీరోను అప్రోచ్ కాలేదు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం. ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ మీల్స్. చరిత్రలో బయటకు రాని కొన్ని సంఘటనలు, దారుణాలు ఎదుర్కొనేందుకు ఓ వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుందనేది మా మూవీలో చూస్తారు.' అని చెప్పారు.
Also Read : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
'డేవిడ్ రెడ్డి' నిజమైన పాన్ ఇండియా సినిమా అని డైరెక్టర్ హనుమరెడ్డి తెలిపారు. 'మనకు ఒకరే భగత్ సింగ్, ఒకరే సుభాష్ చంద్రబోస్, ఒకరే డేవిడ్ రెడ్డి. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఈ మూవీని తీశాం. గ్లింప్స్‌లో చూపించింది కొంతే. మిగతాది సినిమాలో చూస్తారు. మనోజ్ గారు ఓకే అన్నాక టెక్నీషియన్స్ కోసం సెర్చ్ స్టార్చ్ చేశా. పెద్ద పెద్ద సినిమాలకు పని చేసిన వారంతా ఈ మూవీ స్టోరీ విని ఓకే చెప్పారు.' అని తెలిపారు.
'కేజీఎఫ్' నుంచి తన మ్యూజిక్‌ను ఎంతో అభిమానిస్తున్నారని... తన మ్యూజిక్‌కు తెలుగు ఫ్యాన్స్ ఉన్నారని గర్వంగా చెబుతానని మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ తెలిపారు. సినిమా గ్లింప్స్‌లో చూసింది కొంతైతే... మూవీలో మరింత మంచి కంటెంట్ చూస్తారని చెప్పారు. 'డేవిడ్ రెడ్డి'కి సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు ప్రొడ్యూసర్స్ వెంకట్ రెడ్డి, భరత్. ఈ మూవీ అందరికీ ఫేవరెట్ అవుతుందని అన్నారు.
పాన్ ఇండియా స్థాయిలో...
ఈ మూవీలో మనోజ్ సరసన మరియా ర్యబోషప్క హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.





















