Allu Arjun: అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్... 'పుష్ప' నుంచి బయటకు రావాలని... అట్లీ ఏం చేస్తాడో?
AA22 x A6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పనులు ముంబైలో మొదలు అయ్యాయి. లుక్ టెస్ట్ నిర్వహించారు.

పాన్ ఇండియా ప్రేక్షకుల మీద పుష్ప చూపించిన ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటనలో వేరియేషన్ తెలుగు ప్రేక్షకులు చూశారు. ఆయన స్టైల్ ఏమిటనేది టాలీవుడ్ & మాలీవుడ్ ఇండస్ట్రీలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా కొంత మంది చూశారు. అయితే ఉత్తరాదిన మెజారిటీ ప్రేక్షకులకు అల్లు అర్జున్ అంటే పుష్ప సినిమాలు, పుష్పరాజ్ క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. దాని నుంచి బయటకు తీసుకురావడం కోసం అట్లీ ట్రై చేస్తున్నారని సమాచారం.
ముంబైలో మొదలైన కొత్త సినిమా పనులు...
అల్లు అర్జున్ కోసం లుక్ టెస్ట్ నిర్వహించిన అట్లీ!
తన ప్రతి సినిమా లుక్, స్టైల్ విషయంలో అల్లు అర్జున్ ఎంతో కేర్ తీసుకుంటారు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపించడానికి ట్రై చేస్తారు. అయితే... గత నాలుగైదు సంవత్సరాలగా ఆయన సిల్వర్ స్క్రీన్ మీద పుష్ప రాజ్ లుక్ మైంటైన్ చేశారు. అందుకని కొత్త సినిమాలో వేరియేషన్ చూపించాలని డిసైడ్ అయ్యారు.
ఇటీవల అల్లు అర్జున్ ముంబై వెళ్లారు. అక్కడ మహబూబ్ స్టూడియోలో అట్లీ దర్శకత్వంలో తాను హీరోగా నటించబోయే కొత్త సినిమా కోసం లుక్ టెస్ట్ నిర్వహించారు. రగ్గడ్ లుక్ నుంచి స్టైలిష్ అండ్ స్లీక్ లుక్ వరకు వివిధ వేరియేషన్స్ ట్రై చేశారు.
ఒక్క లుక్ కాదు... మూడు ట్రై చేయాల్సిందేనా?
అల్లు అర్జున్ హీరోగా అట్లీ చేయబోయే సినిమా కథ ఏమిటి అనేది యూనిట్ సభ్యులు అయితే వెల్లడించలేదు. కానీ ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం బలంగా జరుగుతుంది. తండ్రి పాత్రతో పాటు ఇద్దరు కొడుకులు గా ఆయన కనిపించనున్నారట. అందుకోసం అల్లు అర్జున్ మూడు లుక్స్ ఫైనలైజ్ చేయాల్సి ఉందని టాక్.
Also Read: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
సినిమా బడ్జెట్ 800 కోట్లు... అందులో ఆ రెండొందలూ!
Allu Arjun and Atlee movie budget: అల్లు అర్జున్ మార్కెట్ ఎంతనేది పుష్ప సినిమాతో ట్రేడ్ వర్గాలకు స్పష్టంగా తెలిసింది. సినిమా హిట్ అయితే 1000 కోట్లు, బ్లాక్ బస్టర్ అయితే 1500 కోట్లు రావడం కష్టమేమీ కాదు. అందుకని సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందించేందుకు రెడీ అయ్యారు సుమారు 800 కోట్ల బడ్జెట్ కేటాయించారట. అందులో 200 కోట్ల రూపాయలు కేవలం విజువల్ ఎఫెక్ట్ వర్క్స్ కోసం పక్కన పెట్టినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం అట్లీతో పాటు అల్లు అర్జున్ కూడా అమెరికాలోనే లాస్ ఏంజెల్స్ సిటీలోని కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలతో మాట్లాడి వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాను సైడ్స్ మీదకు తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: ఎంగేజ్మెంట్, మ్యారేజ్ ఫోటోలు డిలీట్... విడాకుల దిశగా సింగర్ హారికా నారాయణ్?





















