AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
Raj Kasireddy ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి ఏసీబీ స్పెషల్ కోర్టు రెండు వారాలపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)కి ఏసీబీ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఏసిబి స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రావు మంగళవారం అర్ధరాత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. రిమాండ్ విధించిన అనంతరం నిందితుడు రాజ్ కసిరెడ్డిని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు.
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని న్యాయమూర్తి ప్రశ్న
నిందితుడు కాసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజ శేఖర్ రెడ్డిని సిఐడి కోర్టులో హాజరు పరచడానికి బదులుగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని న్యాయమూర్తి అడిగారు. అయితే ఈ కేసు అవినీతి నిరోధక చట్టం తో ముడిపడి ఉందని, జ్యుడీషియల్ రిమాండ్ విధించే అధికారం ఏసిబి కోర్టుకు ఉందని సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, లాయర్ పీపీ కళ్యాణి వాదనలు వినిపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా వ్యవహరిస్తూ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లో అధికారులను సైతం నిందితుడు ప్రభావితం చేశాడని, ఆయన కార్పొరేషన్ లో ప్రభుత్వ ఉద్యోగి కూడా కాదని.. సెక్షన్ 17 ఏ కింద అనుమతి అవసరం లేదని వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఐటీ సలహాదారుగా 2 లక్షల జీతం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ఆధారాలు చూపించింది. దాంతో ఏపీ లిక్కర్ కేసులో ACB సెక్షన్లు వర్తిస్తాయని న్యాయమూర్తి భావించారు.
లిక్కర్ స్కాం కేసులో కీలకపాత్ర
నిందితుడికి రిమాండ్ విధించే అధికారం ఏసీబీ ఏసీబీ కోర్టుకు లేదంటూ రాజ్ కసిరెడ్డి తరఫున సీనియర్ లాయర్ ఉన్నవాళ్లు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సోమవారం అరెస్టు సందర్భంగా ఇచ్చిన మెమోలో పిసి యాక్ట్ లోని సెక్షన్లు ప్రస్తావించలేదని.. సిఐడి రిమాండ్ రిపోర్టులో పీసీ యాక్ట్ సెక్షన్ లో చేర్చారు కనుక రిమాండ్ భరించాలని న్యాయమూర్తిని కోరారు. 3200 కోట్ల లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి కీలకపాత్ర పోషించారు. A3 నిందితుడి విచారణకు సెక్షన్ 17 ఏ అనుమతి లభించింది. కనుక నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ రివెంజే అధికారం ఉందని దమ్మాలపాటి కోరారు. ఇరుపక్షాల వాదనల అనంతరం మే 6 వరకు నిందితుడు రాజ్ కసిరెడ్డికి ట్రెడిషియల్ రిమాండ్ విధించారు.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్
లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డిని సీఐడీ అధికారులు సోమవారం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఆయనపై లిక్కర్ స్కాం కేసు నమోదై, విచారణకు రావాలని సీఐడీ నోలీసులు జారీ చేయడంతో విదేశాలకు పారిపోయారని ఆరోపణలున్నాయి. తాను విచారణకు హాజరవుతానని, ముందు కోర్టులో తనకు ఊరట లభించాలని భావించారు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించి విచారణ చేపట్టారు. తరువాత మంగళవారం కొన్ని గంటలపాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరం ఏసీసీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట కసిరెడ్డిని ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి రెండు వారాలపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.






















