KL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు
నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ ఎవరికి ఇంపార్టెంటో తెలియదు కానీ. కేఎల్ రాహుల్ కి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే అదే LSG ఒకప్పుడు రాహుల్ ను అందరి ముందూ అవమానించింది కాబట్టి. నిన్న లక్నో ఎకానా స్టేడియంలో ముందు బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసింది LSG. పంత్ టీమ్ ఇచ్చిన టార్గెట్ ను పోరల్, అక్షర్ పటేల్ తో కలిసి సాఫీగా ఛేజ్ చేసి పారేశాడు కేఎల్ రాహుల్. ఈ సీజన్ లో దుమ్ము రేపుతున్న రాహుల్ నిన్న మూడో హాఫ్ సెంచరీ కొట్టేశాడు. స్లో వికెట్ మీద ఆవేశపడ కుండా వివేకంతో ఆలోచించి ఆచి తూచి ఆడాడు. 42బంతుల్లో 3ఫోర్లు 3సిక్సర్లతో 57పరుగులు చేసి కేఎల్ రాహుల్ తన క్లాస్ ఆటను చూపించాడు. లాస్ట్ బాల్ కి సిక్స్ కొట్టి విజయానికి కావాల్సిన పరుగులను పూర్తి చేశాడు. ఫలితంగా ఢిల్లీ LSG పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బంది అంతా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఆ టైమ్ లో LSG సంజీవ్ గోయెంకా కూడా గ్రౌండ్ లోకి వచ్చారు. అందరీకి షేక్ ఇస్తూనే రాహుల్ కి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. రాహుల్ కూడా హలో సర్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోబోయాడు. ఇంతలో సంజీవ్ గోయెంకా రాహుల్ తో ఏదో మాట్లాడుకున్నారు అనుకుంటా ఇంకా ఏదో మాట్లాడుతుంటే పని ఉందన్నట్లు ముందుకు చూపించి ముందు వారికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్లిపోయాడు రాహుల్. పాపం గోయెంకా ఫేస్ మాడిపోయింది. ఇప్పుడే కాదు ఈ మ్యాచ్ రాహుల్ సిక్సో, ఫోరో కొట్టినప్పుడల్లా గోయెంకానే చూపించారు ఎందుకో. ఆయన మైండ్ లో ఏదో మూల అబ్బా ఇంలాంటి ప్లేయర్ ను వదిలేసుకున్నామే అని ఫీల్ అవుతూనే ఉండి ఉంటారు. అండ్ రాహుల్ కూడా గత సీజన్ లోనూ ఆయన అందరి ముందూ అన్న మాటలను మర్చిపోయేనట్లు లేడు. తన సత్తా ఏంటో తన గేమ్ తోనే చూపించి పెద్దాయన్ను సింపుల్ గా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్లిపోయాడు.





















