అన్వేషించండి

Religious Beliefs: గుడిలోనో, పూజలోనో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చేయాలి - ఆ పాపం వెంటాడుతుందా?

తెలిసి చేసే పాపాలు, తెలియక చేసే పాపాలు ఉంటాయి. వాటిలో ఒకటి పీరియడ్స్. ముఖ్యమైన పూజలోనో, ఏదైనా క్షేత్రంలోనో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చేయాలి?

If You Get Periods in a Temple: కొన్ని దీక్షలు 40 రోజులు చేయాల్సినవి వస్తాయి.. మరికొన్ని దీక్షలు వారం, పక్షం రోజులు చేయాల్సినవి ఉంటాయి. మీరు చేసే దీక్ష ఆధారంగా మీరు ప్రారంభించే రోజును ప్లాన్ చేసుకోవాలి. 

40 రోజుల పాటు పారాయణం, దీక్ష చేయాల్సి ఉన్నప్పుడు తప్పనిసరిగా నెల రోజుల్లో రుతుక్రమం వస్తుంది. మరి లెక్క తప్పుతుంది కదా ఏం చేయాలి అనే సందేహం వస్తుంది. అయితే 40 రోజల పాటూ చేసే పారాయణం, దీక్షల సమయంలో పీరియడ్స్ వస్తే ఆ రోజుతో పారాయణం ఆపేసి.. తిరిగి ఐదోరోజు స్నానం ఆచరించినప్పటి నుంచి కంటిన్యూ చేయవచ్చు. లెక్క మళ్లీ మొదటి నుంచి రావాల్సిన అవసరం లేదు. 

సప్తాహ పారాయణం అని కొందరు చేస్తుంటారు. ఇలాంటప్పుడు మీకు ఇబ్బంది అయిపోయిన వెంటనే ప్రారంభిస్తే మళ్లీ పీరియడ్స్ వచ్చేలోగా మీ దీక్ష, పారాయణం పూర్తవుతుంది. ఇలా సప్తాహం చేసే రోజుల్లో డేట్ వస్తే మాత్రం ఐదు రోజుల స్నానం అనంతరం మళ్లీ మొదట్నుంచి చేయాల్సిందే

సత్యనారాయణ స్వామి వ్రతం, నోములు, ప్రత్యేక పూజల్లో ఉన్న సమయంలో పీరియడ్స్ వస్తే మాత్రం మీకు సందేహం వచ్చిన క్షణమే అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడం మంచిది. పూజ/వ్రతం మధ్యలో ఉన్నప్పుడు లేచి వెళ్లిపోతే పాపం ఏమో అని ఆలోచించి కొనసాగించడం ఇంకా పాపం. అయితే ఆ పూజని అక్కడితో ఆపేయాల్సిన అవసరం లేదు. మీ జీవిత భాగస్వామి కొనసాగించవచ్చు.

పీరియడ్స్ సమయంలో స్తోత్రాలు చదవకూడదు, పారాయణం చేయకూడదు 

ఇక ఆలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు డేట్ వస్తే ఏంటి పరిస్థితి అనే సందేహం ఉంటుంది. ఏదైనా క్షేత్రంలో ఉన్నప్పుడు డేట్ వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆలయంలోకి ప్రవేశించకూడదు. రూమ్ లోనే ఉండిపోవాలి. కొన్నిసార్లు ఆలయంలో ప్రవేశించిన తర్వాత క్యూ లైన్ల మధ్యలో ఉండగా పీరియడ్స్ వస్తే ..అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. అయితే తిరుమల లాంటి ఆలయాలకు వెళ్లినప్పుడు క్యూలైన్లలోకి ఒక్కసారి వెళ్లిన తర్వాత వెనక్కు తిరిగి రాలేం.. పరిస్థితి మనచేతిలో లేనప్పుడు భగవంతుడా క్షమించు అనుకుని ముందుకు సాగిపోవాల్సిందే. 

తెలియకుండా జరిగే తప్పుని దేవుడు క్షమిస్తాడు..కానీ తెలిసి చేసిన తప్పుని దేవుడు క్షమిస్తాడా అనే సందేహాలు కూడా వస్తాయ్?
దీనికి సమాధానం లక్షవత్తుల నోము అని పండితులు చెబుతారు. వివాహితులు చేసే చాలా నోముల్లో ఒకటి లక్షవత్తుల నోము. ఈ నోముని ఒక్కరోజులో పూర్తిచేసేస్తారు. రాత్రంతా కూర్చుని లక్షవత్తులు వెలిగిస్తారు..చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ నోము పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయిన తర్వాత చేస్తారు. ఈ ఒక్క నోము చేయడం వల్ల తెలిసి, తెలియకుండా చేసిన పాపాలు తొలగిపోతాయి, భ్రూణహత్య లాంట దోషాలను కూడా ఈ నోము తొలగిస్తుందని చెబుతారు. 

తిరుమల లాంటి క్షేత్రానికి టికెట్లు బుక్ చేసుకుంటారు...ఆ సమయంలో పీరియడ్స్ వస్తే? ఇంట్లో చెబితే ఏమంటారో అనే భయంతో చెప్పకుండా ఆగిపోతారు. కొన్నిసార్లు ఇంట్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలో డేట్ వచ్చినప్పుడు కూడా చెప్పేందుకు సందేహిస్తారు. గొడవ చేస్తారేమో, తిడతారేమో అని ఆగిపోతారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆమెకు కుటుంబంలో సహకారం ఉండాల్సిందే. ఇలాంటి వాతావరణం లేనప్పుడు ఆమె చేసే పాపం ఇంటిల్లిపాదిని చుట్టుకుంటుంది.  జీవిత భాగస్వామికి పీరియడ్స్ వస్తే ఆమెను తాకకుండా, ఆమె పెట్టిన భోజనం తినకుండా ఉన్నట్టైతే మీరు ఆలయానికి వెళ్లిరావొచ్చు. 
 
ముఖ్య గమనిక: పీరియడ్స్ లో పాటించాల్సిన నియమాల గురించి ఏదైనా చర్చ ప్రారంభించగానే స్త్రీవాదులంతా భిన్నమైన వాదనలు వినిపిస్తుంటారు. ఇది ప్రకృతి సహజం, ఈ పేరుతో స్త్రీలను అవమానించవద్దంటూ వాదిస్తారు. ఇదే మీ ఆలోచన అయితే ఈ కథనం మీకోసం కాదు. ఎలాంటి పట్టింపులు లేనప్పుడు మీరు ఇవేమీ పాటించాల్సిన అవసరం లేదు. నిత్యం పూజ, ఉపాసన చేసేవారి ,సంప్రదాయాన్ని పాటించేవారి కోసంమే ఈ సలహాలు సూచనలు. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
Peddi Review : ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
Hardik Pandya : తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
Tamil Nadu Crime News: తండ్రిని పాముతో కరిపించి హత్య చేసిన కుమారులు! బీమా డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం!
తండ్రిని పాముతో కరిపించి హత్య చేసిన కుమారులు! బీమా డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Embed widget