NTR Statue: అమరావతిలో ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహం.. గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో
Andhra pradesh News | ఏపీ రాజధాని అమరావతిలో అత్యంత ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం.

అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. నిజానికి ఇది ఎప్పుడో తీసుకున్న ఆలోచనైనా అయినా కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టేసింది. అమరావతి కోర్ క్యాపిటల్ లో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు.
అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) అమరావతిలోని నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం మరియు స్మారక చిహ్నం కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేయడానికి కన్సల్టెంట్‌ను నియమించడానికి టెండర్లు వేసింది. అలాగే విగ్రహం మోడల్ ఎలా ఉంటుందనే దానిపై కొన్ని ఇమేజెస్ కూడా విడుదల చేసింది.

గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ విగ్రహం
ఇటీవలే మంత్రి నారాయణ బృందం గుజరాత్ లో పర్యటించి వచ్చింది. అక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం " స్టాట్యూ అఫ్ యూనిటీ" ని సందర్శించి వచ్చారు. అలాగే అక్కడి "నరేంద్ర మోడీ స్టేడియం " ను కూడా పరిశీలించి వచ్చారు. ఇప్పుడు అదే తరహాలో అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహం వైపు దృష్టి పెడుతున్నారు. అమరావతి కోర్ క్యాపిటల్ లో సీఎం ఇల్లు,ఇతత కీలక భవనాలు కలుపుతూ 6 కిలోమీటర్ల పొడవైన రోడ్డు రాబోతుంది. కోర్ క్యాపిటల్ వెడల్పు ఒక కిలోమీటర్ ఉంటుంది. 6 కిలోమీటర్ల పొడవైన కోర్ క్యాపిటల్ ఎండింగ్ పాయింట్ గా నీరుకొండ ఉండగా దానిపైన ఎన్టీఆర్ స్టాట్యూ రాబోతుంది. అమరావతికి ముఖ్యమైన అట్రాక్షన్ గా ఎన్టీఆర్ విగ్రహం ఉండాలని సీఎం ఆలోచన. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రెడీ అవుతున్నాయి.





















