Ban On Commentators: కామెంటేటర్లపై వేటు.. ఆ వ్యాఖ్యలే కారణమా..? అసలు వివాదానికి కారణమేంటి..?
CAB VS BCCI Updates: సొంతగడ్డ పిచ్ ల వివాదం చినికిచినికి గాలి వానగా మారుతోంది. ఈ పిచ్ లపై వ్యాఖ్యలు చేసిన ఇద్దరు కామెంటేటర్లు భోగ్లే, డౌల్ లపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Ban on Harsha Bhogle , Simon Doull Commentary: ఐపీఎల్ కామెంటేటర్లు సైమన్ డౌల్, హర్షా భోగ్లే లపై అనధికార నిషేధం పడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఆడే మ్యాచ్ ల్లో ఈ ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది. కేకేఆర్ సొంతగడ్డ అయిన కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో వీరిద్దరి ప్రవేశానికి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై గతంలో వీరిద్దరూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సోమవారం గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ కామెంటరీ ప్యానెల్లో కనిపించలేదు. గతంలో వీరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈడెన్ లో మ్యాచ్ ల సందర్బంగా ఈ ఇద్దరు కామెంటేటర్లను నిషేధించాలని క్యాబ్ కార్యదర్శి నరేశ్ ఓజా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సొంతగడ్డపై ఆడుతున్న జట్ల విషయంలో వీరిద్దరూ గతంలో వ్యాఖ్యలు చేశారు.
Taking strong objection to the public criticism of their curator by Harsha Bhogle and Simon Doull, the Cricket Association of Bengal (CAB) lodged a complaint against the two cricket experts. pic.twitter.com/A9bmtLKzgM
— 𝐂𝐂𝐑 (@CricComradeRaja) April 21, 2025
సొంతగడ్డ అనుకూలత..
సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్నప్పడు ఆయా జట్లకు అనుకూలంగా పిచ్ ను రూపొందించాల్సిన బాధ్యత ఆయ క్రికెట్ సంఘాల క్యూరెటర్లదేనని డౌల్ వ్యాఖ్యానించాడు. స్టేడియాన్ని అద్దెకి తీసుకుని, కోట్లాది రూపాయలు ఫీజుల, ఇతర రుసుములను ఆయ జట్లు చెల్లిస్తుంటాయని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సొంతగడ్డకు మేలు చేకూర్చేలా పిచ్ ను రూపొందించాలని డౌల్ వ్యాఖ్యానించాడు. అలా వీలు కాకపోతే తమ వేదికపు వేరే చోటకి మార్చుకోవచ్చని సూచించాడు. ఒక సొంతగడ్డపై అనుకూలమైన పిచ్ రూపొందించాల్సిన బాధ్యత ఆయ క్రికెట్ సంఘాలదేనని భోగ్లే వ్యాఖ్యానించాడు. ఇలా జరగని నేపథ్యంలోనే కేకేఆర్ మ్యాచ్ లు ఓడిపోతోందని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు.
కేకేఆర్ ఆసంతృప్తి..
ఒక సొంతగడ్డపై తమకు అనకూలంగా పిచ్ లు రూపొందించడం లేదని చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ జట్లు గతంలో ఆరోపించాయి. ముఖ్యంగా స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లను రూపొందించాలని కోరగా, క్యాబ్ క్యూరెటర్ సుయాన్ ముఖర్జీ అందుకు విరుద్ధమైన పిచ్ ను ఇచ్చాడని కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే గతంలో అసహనం వ్యక్తం చేశాడు . వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, మొయిన్ అలీ తదితర వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్న నేపథ్యంలో స్పిన్ కు అనుకూలమైన పిచ్ రూపొందించాలని కేకేఆర్ కోరుతోంది. అయితే బీసీసీఐ గైడ్ లైన్ల మేరకు పిచ్ ను రూపొందిస్తామని ముఖర్జీ పేర్కొంటుండటంతో ఈ తకరారు వచ్చింది. తాజాగా ఇది కామెంటేటర్లపై ఎఫెక్ట్ చూపించింది. ఒకపై ఈడెన్ లో కేకేఆర్ ఆడే మ్యాచ్ ల్లో డౌల్, భోగ్లే కామెంటరీ చేయకపోవచ్చని, అయితే క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్ కు మాత్రం వీరిద్దరూ కామెంటరీ చెప్పే అవకాశమున్నట్లు సమాచారం.




















