Razor Movie: 'రేజర్'తో రక్తపాతం... ఈ టైటిల్ గ్లింప్స్ పిల్లలు చూడకపోవడం మంచిది - రవిబాబు ఈజ్ బ్యాక్
Razor Title Glimpse: విలక్షణ దర్శకుడు రవిబాబు కొత్త సినిమాకు 'రేజర్' టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అది చిన్న పిల్లలు చూడకపోవడం మంచిది.

నటుడిగా, దర్శకుడిగా రవిబాబు (Ravi Babu)ది విలక్షణ శైలి. ముఖ్యంగా ఇంటెన్స్ థ్రిల్లర్, హారర్ సినిమాలు తీయడంలో ఆయన స్పెషలిస్ట్. 'అనసూయ', 'అవును', 'అమరావతి' వంటి హారర్ ఫిలిమ్స్ ఆయన దర్శకత్వంలో నుంచి వచ్చినవే. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆయన భయపెట్టారు. కొంత విరామం తర్వాత రవిబాబు మళ్ళీ మెగాఫోన్ పట్టారు. ఈసారి యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఆయన కొత్త సినిమాకు 'రేజర్' టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.
రేజర్... రవిబాబు రక్తపాతం!
Razor Title Glimpse Review: రవిబాబు దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'రేజర్'. టైటిల్, గ్లింప్స్ అనౌన్స్ చేయడానికి ముందు ఒక కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. గాజు గ్లాసు, అందులో రక్తం కారుతున్న చెవి, పక్కన షేవింగ్ చేయడానికి సెలూన్స్‌లో ఉపయోగించే రేజర్... పోస్టర్‌తో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు రవిబాబు. ఈ రోజు విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌తో అయితే ఒక్కసారిగా ఒళ్ళు జలజడరించేలా చేశారు.
'రేజర్' టైటిల్ గ్లింప్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... బ్లడ్ బాత్. కత్తి గాటు చూపించలేదు. కోసినట్టు విజువల్ లేదు. కానీ 'రేజర్'తో మనిషిని కోసినట్టు చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. 18 ప్లస్ అంటూ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. మనుషుల శరీర భాగాలను ఒక్కొక్కటిగా కొస్తే... పార్టులు పార్టులు పడటం చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది.
క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కింద రూపొందుతున్న 'రేజర్'కు రవిబాబు దర్శకత్వం వహించడం మాత్రమే కాదు... సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకం మీద అగ్ర నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది (2026) వేసవిలో థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు.





















