KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటి
మీ అందరికీ లాస్ట్ ఐపీఎల్ సీజన్ గుర్తుంటే...కేఎల్ రాహుల్ LSG కెప్టెన్. కానీ లాస్ట్ ఇయర్ కెప్టెన్ గా విఫలమయ్యాడని LSG ఓనర్ సంజీవ్ గోయెంకా పలు మార్లు రాహుల్ ను అందరి ముందే గ్రౌండ్లోనే వేలమంది ప్రేక్షకులు చూస్తుండగానే తిట్టారు. ఇది స్పష్టంగా కెమెరాల్లో కూడా కనపడింది. బాగా ఇగో హర్ట్ అయిన రాహుల్ తన వ్యక్తిత్వాన్ని చంపుకోలేక కెప్టెన్సీ కూడా కాదనుకుని మొన్న ఆక్షన్ లో నిలబడ్డాడు. లక్నో ఇచ్చే 17 కోట్లు కాదని తనను 14 కోట్లకే కొనుక్కున్న ఢిల్లీకి నవ్వుతూ వెళ్లిపోయాడు. కెప్టెన్సీ కూడా వద్దని దాన్ని అక్షర్ పటేల్ కి ఇవ్వమని తను ఓ మాములు వికెట్ కీపర్ బ్యాటర్ గా ఈ సీజన్ ఆడుకుంటున్నాడు. మరో వైపు రిషభ్ పంత్ ది సపరేట్ కథ. ఢిల్లీకి కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్ ను ఆక్షన్ లో సంజీవ్ గోయెంకా రాహుల్ కి రీప్లేస్ గా కొనుకున్నారు. ఎంతెలా అంటే ఐపీఎల్ 18ఏళ్ల చరిత్రలోనే లేని విధంగా ఏకంగా 27కోట్ల రూపాయల డబ్బును రిషభ్ పంత్ కోసం ఖర్చు చేశారు LSG ఓవర్ సంజీవ్ గోయెంకా. ఆక్షన్ లో పంత్ ను కొనుక్కున్నప్పుడు ఆయన ఆనందం చూడాలి. ఓ రేంజ్. ఇప్పుడు ఏమైందంటే ఈ సీజన్ లో రాహుల్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపుతోంది. తనకు పాప పుట్టడంతో ఈ సీజన్ లో లేట్ గా జాయిన్ అయిన రాహుల్ 7 మ్యాచ్ లు మాత్రమే ఆడి అందులో మూడుసార్లు హాఫ్ సెంచరీలు బాదాడు. 153 స్టైక్ రేట్ తో 7మ్యాచ్ ల్లోనే 323 పరుగులు చేశాడు. సేమ్ టైమ్ 27 కోట్లు పెట్టుకుని రిషభ్ పంత్ కెప్టెన్ గా ఓకే. LSG కూడా పూరన్, మిచ్ మార్ష్ లాంటి ఆటగాళ్ల ప్రతిభ కారణంగా మంచి విజయాలనే అందుకుంటోంది. కానీ రిషభ్ పంత్ మాత్రం బ్యాటర్ గా ఈ సీజన్ లో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. నిన్న కూడా 18 ఓవర్ వచ్చినా బ్యాటింగ్ కి దిగకుండా వెనకు ఉండేవాళ్లందిరనీ ముందు పంపించాడు. పోనీ దిగాక ఏమన్నా ఆడాడా అంటే లేదు క్లీన్ బౌల్డ్ , డకౌట్. అసలు ఈ సీజన్ లో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన పంత్..6 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యాడు. అందులో మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఓవరాల్ గా ఈ సీజన్ లో ఇప్పిటికి చేసిన పరుగులు 106. 27 కోట్లు పెట్టి కొన్న ఆటగాడి నుంచి దారుణ ప్రదర్శన ఇది. అలాంటిది ఈ పంత్, కేఎల్ రాహుల్ నిన్న ఎదురు బొదురు ఆడేప్పటికి సంజీవ్ గోయెంకా బాధ ఒకటి కాదు. తిట్టిపోసిన రాహుల్ హాఫ్ సెంచరీలు కొడుతూ మ్యాచ్ లు గెలిపిస్తుంటే..కోట్లు పోసి కొనుక్కున్న పంత్ ఏమో కోడిగుడ్లు పెడుతున్నాడని. టైమ్.





















