Abhinaya Wedding: అభినయకు పెళ్లైంది... బాయ్‌ఫ్రెండ్‌తో ఏడడుగులు వేసిన నటి... లేటుగా ఫోటోలు విడుదల
Abhinaya Wedding Photos: తెలుగు తమిళ మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసిన నటిగా గుర్తింపు తెచ్చుకున్న అభినయ ఓ ఇంటి కోడలు అయ్యారు. బాయ్ ఫ్రెండ్ కార్తీక్ వేగేశ్నతో ఆవిడ ఏడడుగులు వేశారు. ఆ ఫోటోలు చూడండి.

నటి అభినయ (Abhinaya) ఓ ఇంటి కోడలు అయ్యారు. బాయ్ ఫ్రెండ్ కార్తీక్ వేగేశ్న (Abhinaya Husband Name Photo)తో బుధవారం ఏడు అడుగులు వేశారు. ఇవాళ పెళ్లి ఫోటోలను ఆవిడ షేర్ చేశారు.
పదిహేనేళ్ల ప్రేమ...
పెద్దల అంగీకారంతో!
అభినయ జీవితంలో బుధవారం కొత్త అధ్యాయం మొదలు అయ్యింది. ఆవిడ వివాహ బంధంలో అడుగు పెట్టారు. తన చిన్ననాటి స్నేహితుడు, 15 ఏళ్లగా ప్రేమలో ఉన్న కార్తీక్ వేగేశ్నను పెళ్లి చేసుకున్నారు.
Abhinaya Weds Karthik Vegesna: అభినయ, కార్తీక్ వేగేశ్న కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిగింది. ఆ ఫోటోలను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంత కంటే ముందు కొన్ని పెళ్లి వీడియోలు బయటకు వచ్చాయి. అందులో కార్తీక్ వేగేశ్నను అభినయ ఆట పట్టించడం కనిపించింది.
Also Read: ఎవరీ ప్రియాంక? రెండో పెళ్లి చేసుకుంటే ఎందుకంత డిస్కషన్... వశీతో బిగ్ బాస్ బ్యూటీ ప్రేమకథ తెల్సా?
View this post on Instagram
ఎవరీ కార్తీక్ వేగేశ్న?
ఆయన ఏం చేస్తారు??
Who Is Karthik Vegesna, Everything You Need To Know About Abhinaya Husband: అభినయతో వివాహం నేపథ్యంలో కార్తీక్ వేగేశ్న పేరు సినిమా పరిశ్రమతో పాటు ప్రేక్షకులలో పాపులర్ అవుతోంది. అతను ఎవరు? చాలా మంది ఆరాలు తీస్తున్నారు. కార్తీక్ ముద్దు పేరు సన్నీ వర్మ. అతనిది విశాఖపట్నం అని సమాచారం. కన్స్ట్రక్షన్ రంగంలో ఆయన పాపులర్ అని, అతను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని తెలిసింది.
Also Read: ఓదెల 2 రివ్యూ: తమన్నాతో 'అరుంధతి' తీయాలని ట్రై చేస్తే ఏమైంది? సినిమా హిట్టా? ఫట్టా?
నటిగా మంచి పేరు...
ఇప్పుడు నయన్ సినిమాలో!
జన్మతః అభినయకు వినికిడి లోపం ఉంది. అలాగే ఆమెకు మాటలు కూడా రావు. అయితే, అభినయ పట్టుదల ముందు ఆ రెండు అసలు ఆటంకం కాలేదు. నటిగా తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలలో మంచి పేరు తెచ్చుకున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'నేనింతే'తో అభినయ తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు. నటిగా ఆమె మొదటి సినిమా అది. అందులో ఆవిడ చిన్న క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత నాగార్జున 'కింగ్'లోనూ కనిపించారు. అయితే, అవినీతి పేరు తీసుకు వచ్చింది మాత్రం రవితేజ 'శంభో శివ శంభో' సినిమా. తమిళ సినిమా 'నానోడిగల్' రీమేక్ అది. ఆ సినిమా రెండు భాషలలోనూ ఆవిడ నటించారు. ఆ తరువాత 'దమ్ము', 'డమరుకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ధృవ', 'రాజు గారి గది 2', 'సీతా రామం', 'గామి', విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' తదితర సినిమాలలో నటించారు. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'మూకుత్తి అమ్మన్ 2' సినిమా చేస్తున్నారు.





















