అన్వేషించండి
Uday Raj Interview: 'ఆచార్య', 'ఆర్ఆర్ఆర్'లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి 'మధురం'లో హీరో వరకు... ఉదయ్ రాజ్ ఇంటర్వ్యూ
Madhuram Movie Release Date: 'ఆచార్య', 'ఆర్ఆర్ఆర్'లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఉదయ్ రాజ్... 'మధురం'తో హీరోగా పరిచయమవుతున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 18) సినిమా విడుదల నేపథ్యంలో అతనితో ఇంటర్వ్యూ...
'ఆచార్య', 'ఆర్ఆర్ఆర్'లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి 'మధురం'లో హీరో వరకు... ఉదయ్ రాజ్ ఇంటర్వ్యూ
1/4

''నాకు చిన్నప్పట్నుంచీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇష్టం. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చా. ఆయనతో 'ఆచార్య' షూటింగ్ చేసేటప్పుడు మాట్లాడటం గొప్ప అనుభూతి'' అని ఉదయ్ రాజ్ అన్నారు. 'ఆచార్య'తో పాటు 'ఆర్ఆర్ఆర్', ఇంకా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసిన ఆయన... 'మధురం'తో హీరోగా పరిచయం అవుతున్నారు. రాజేష్ చికిలే దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం బంగార్రాజు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 18న (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ''నేను 12 ఏళ్లగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రతి శాఖలో పని చేశా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ కింద కూడా కనిపించాను. నిర్మాత బంగార్రాజు గారి మద్దతుతో 'మధురం'తో హీరోగా మారాను'' అని ఉదయ్ రాజ్ చెప్పారు.
2/4

'మధురం' గురించి ఉదయ్ రాజ్ మాట్లాడుతూ... ''సినిమా కథ 90ల నేపథ్యంలో జరుగుతుంది. పదో తరగతి అమ్మాయితో తొమ్మిదో తరగతి అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథతో సినిమా చేశాం. ఆ పాత్రలో మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. చిన్న పిల్లాడిగా, స్కూల్ స్టూడెంట్‌గా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా... ఆ మూడు గెటప్స్ వేయడానికి కష్టపడ్డా. చబ్బీగా కనిపించి మళ్ళీ సన్నబడడం కోసం ఫుడ్ మానేసి కేవలం నీళ్లు తాగిన రోజులు ఉన్నాయి. నేనూ జెడ్‌పీహెచ్ స్కూల్ స్టూడెంట్. అమ్మాయి ముందు సైకిల్ బ్రేక్ కొట్టడం, చేతులు వదిలేసి సైకిల్ తొక్కడం వంటి సీన్లతో పాటు గ్రామీణ నేపథ్యంలో సన్నివేశాలు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. నోస్టాల్జియా ఫీలింగ్ ఇచ్చే చిత్రమిది'' అని చెప్పారు.
3/4

హీరోయిన్ వైష్ణవి సింగ్ గురించి ఉదయ్ రాజ్ మాట్లాడుతూ... ''మేం తెలుగ అమ్మాయిని తీసుకోవాలని ట్రై చేశాం. కానీ కుదరలేదు. అయితే వైష్ణవి సింగ్ అద్భుతంగా నటించింది. దర్శకుడు రాజేష్ చికిలే అందంగా సినిమా తీశారు. ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకీ వీణ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇక మా సినిమాపై నమ్మకంతో నిర్మాత బంగార్రాజు సొంతంగా రిలీజ్ చేస్తున్నారు'' అని అన్నారు.
4/4

ఇండస్ట్రీలో పెద్దల సపోర్ట్ గురించి ఉదయ్ రాజ్ మాట్లాడుతూ... ''విశ్వక్ సేన్ గారు పోస్టర్ లాంచ్, నితిన్ గారు టీజర్, వీవీ వినాయక్ గారు ట్రైలర్ విడుదల చేశారు. వినాయక్ గారిని కలిసినప్పుడు నా గురించి ఆయన చెప్పిన మాటలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. హీరో అని కాదు... ఎలాంటి క్యారెక్టర్లు చేయడానికి అయినా నేను రెడీ'' అని అన్నారు.
Published at : 17 Apr 2025 06:45 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















