Pawan Kalyan Birthday Celebrations: పుట్టినరోజు వేడుకలకు పవన్ దూరం! వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపు
Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తిన కారణంగా పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
Andhra Pradesh: పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ ఏడాది ఆయన పుట్టిన రోజు మరింత ప్రత్యేకం అయితే భారీ వర్షాలతో అకస్మాత్తుగా విరుచుకుపడిన వరదలు ముంచెత్తడంతో పవన్ కల్యాణ్ తన అభిమానులకు, పార్టీ శ్రేణులకు వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునివ్వడంతో పూర్తిగా ఆవైపుగా దృష్టిసారిస్తున్నారు ఆయన అభిమానులు, పార్టీశ్రేణులు.. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని అంటేలా చేయాలనుకున్న అభిమానులు కొంత నిరాస పడినా తన అభిమాన నేత సూచనల మేరకు వరద ఫ్రభావిత ప్రాంతాలకు సోమవారం తరలి వెళ్లేందుకు సన్నధ్ధమవుతున్నారు...
వరద బాధితులకు అండగా నిలవండి..
జనసేన పార్టీ శ్రేణులకు, ఆయన అభిమానులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గనాలని పిలుపునిచ్చారు.. ముంపు ప్రాంత ప్రజలకు రక్షిత మంచినీరు, ఆహారం, వైద్య సదుపాయాలను కల్పించాలని ఆయన సూచించారు. అదేవిధంగా వరదల్లో నిరాశ్రయులైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, జనసేన వైద్య విభాగం నుంచి పునరావాస కేంద్రాల వద్ద వైద్యసేవలు, అవసరం అయిన వారికి మందులు పంపిణీ, వరద సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైన అధికారులకు, సిబ్బందికి సహాయక చర్యల్లో స్వచ్ఛందంగా సహాకారం అందివ్వాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు..
భారీ వేడుకలుకు దూరం.. సేవల వైపే పయణం..
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఏపీలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు జనసేన పార్టీ నాయకులుతోపాటు కూటమి నేతలు ప్లాన్ చేశారు.. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా భారీ వేడకలను విరమించి పూర్తిగా బాధితులకు అండగా నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, చిన్నారులకు, రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ ఇలా తలో పనిని పంచుకుంటూ విజయవాడ వైపు ముందుకు కదులుతున్నారు.. వరద ప్రభావం పెద్దగా లేని ప్రాంతాలకు చెందిన పవన్ కల్యాణ్ అభిమానులు నిత్యావసర సరుకులు పెద్ద ఎత్తున వరద ప్రభావిత ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు ఆదివారం రాత్రి సరుకుల ప్యాకింగ్‌లు కూడా చేస్తున్నామని తెలిపారు.
Also Read: బాలకృష్ణ స్వర్ణోత్సవాలకు చంద్రబాబు గైర్హాజరు, ఫోన్లోనే బాలయ్యకు విషెస్
ఓజీ ఫస్ట్ సింగిల్, పోస్టర్ రిలీజ్ వాయిదా..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం ఓజీ సినిమాకు సంబందించి ఫస్ట్ సింగిల్, పోస్టర్ రిలీజ్ చేయాలని మేకర్స్ అన్నీ సిద్ధం చేసుకున్నారు... అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ అభిష్టం మేరకు వాయిదా వేసి పరిస్థితులు సద్దుమనిగాక త్వరలోనే మరింత వేడుకగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ వ్యక్తం అవుతోంది..
ఇప్పటికే రాష్ట్రమంతా సేవాకార్యక్రమాలు...
తమ అభిమాని పుట్టిన రోజు అంటే కేవలం సంబరాల్లో మునిగి తేలడమే కాదు.. సేవాకార్యక్రమాల్లో తరించడం అని నిరూపించారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్... ఇప్పటికే అటు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, ఇటు పవన్‌కల్యాణ్ ప్యాన్స్ గత మూడు రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడికక్కడే మెగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాలకు పరీక్షలు చేయించారు.. ఉచిత కంటి వైద్యశిబిరాలు, మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాల్లో పాల్గన్నారు..
Also Read: అల్పపీడనం అంటే ఏమిటి? తుపాన్ ఎలా ఏర్పడుతుంది? తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు