Cyclones | అల్పపీడనం అంటే ఏమిటి? తుపాన్ ఎలా ఏర్పడుతుంది? తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు
Cyclones News | వర్షాకాలం వచ్చిందంటే దేశ వ్యాప్తంగా ఏదో ఒక మూలన తుపాన్ల ప్రభావం ఉండటం అనేది చాలా సాధారణం. కానీ, అప్రమత్తంగా ఉండటం వలన ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు.
How cyclones Formed వర్షాకాలం వచ్చిందంటే చాలు దేశంలో ఎక్కడో చోట తుపాన్ ఏర్పడుతుంది. ఆ ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. తుపాన్ కేంద్రీకృతమైన ప్రాంతంలో మాత్రం బీభత్సమైన పరిస్థితులుంటాయి. బలమైన గాలులు, కుండపోత వర్షం కురుస్తుంది. కుండపోత వర్షానికి ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేయలేం. ప్రాణ నష్టం తగ్గించడం తప్ప.. ఆస్తినష్టం, పంట నష్టం తగ్గించడం మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే తుపాన్ అనేది ఒక ప్రకృతి విపత్తు. ఎంత స్థాయిలో విరుచుకుపడుతుందో అంచనా వేయగలం కానీ, నివారించలేం. నదుల్లో నీటి మట్టం పెరిగి వాగులు, చెరువులు పొంగి ఎంత ప్రభావం ఉంటుందో చెప్పనలవికాదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉంటాయి. అసలు తుపాన్ అంటే ఏమిటీ.. వాయుగుండం అల్పపీడనం ఎలా ఏర్పడతాయి.. వంటి వివరాల గురించి తెలుసుకుందాం..
గాలుల కదలికల వల్ల పీడనాలు ఏర్పడతాయి. పీడనాలు రెండు రకాలుగా ఉంటాయి. అల్ప పీడనం, అధిక పీడనం. అధికంగా పీడనం ఉండే ప్రాంతాన్ని అధిక పీడనం, తక్కువ పీడనం ఉండే ప్రాంతాన్ని అల్ప పీడనం అంటారు. అలాగే గాలులు కూడా రెండు రకాలు.. వేడి గాలి, చల్ల గాలి. ఈ గాలులు భూమ్మీద, సముద్రం మీద వ్యాపించి ఉంటాయి. సహజంగా వేడిగాలి తేలిగ్గా ఉండి పైకి చేరుతుంది. చల్లగాలి నీటి తేమ కారణంగా బరువుగా ఉండి భూ ఉపరితలం మీద చేరుతుంది.
మేఘాలు ఎలా ఏర్పడతాయి...
సముద్ర ఉపరితలం వేడెక్కడం వల్ల చల్లగాలిలోని తేమ ఆవిరై తేలికగా మారి పైకి చేరతాయి. గాలిలో ఉండే నీటి ఆవిరి కూడా పైకి ఘనీభవించి మంచు స్పటికాలుగా మారుతుంది. అవన్నీ కలిసి దట్టమైన మేఘాలుగా ఏర్పడతాయి. ఎక్కువ మొత్తంలో గాలులు పైకి చేరడం వల్ల భూ ఉపరితలం మీద ఖాళీ ఏర్పడుతుంది. దాన్నే అల్పపీడనం అంటారు. ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్న గాలులు ఆ అల్పపీడనం ఉన్నవైపు పరుగులు తీస్తాయి. ఆ వీచే గాలులతోపాటు మేఘాలు కూడా పయనించి చట్లబడి వర్షంగా కురుస్తాయి. ఆ గాలుల సాంద్రత ఎక్కువగా ఉంటే అల్పపీడన ప్రాంతంలో వలయాకారంగా గిర్రున తిరుగుతుంటాయి. అల్పపీడనం మరింత తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది. అది మరింత బలపడితే తుపాన్‌గా అభివృద్ధి చెందుతుందన్నమాట..
సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని మేఘాలు సంగ్రహిస్తాయి. గాలి సుడుగాలుగా తుపాన్‌తో కలిసి పయనించి అల్పపీడన ప్రాంతంలో మేఘాలు వర్షిస్తాయి. భూ ఉపరితలాన్ని తాకగానే మేఘాలు వర్షం రూపంలో సముద్రం నుంచి సంగ్రహించిన నీటిని వర్షం రూపంలో విడుదల చేస్తాయి. సముద్రంలో సుడుల రూపంలో ఉన్న తుపాన్, భూ ఉపరితలాన్ని తాకడాన్నే తీరం దాటడం అంటారు. సముద్రంలో ఏర్పడ్డ సుడిగాలులు భూ ఉపరితలంలోని అల్పపీడన ప్రాంతాన్ని తాకగానే గంటకు 61 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.
తుపాన్ సుడిలో ఉండే అతిపెద్ద శూన్య ప్రదేశాన్నే తుపాన్ కన్ను అంటారు. ఇది చాలా ప్రమాదకరమూన ప్రదేశం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి ఉండదు, మేఘాలు ఉండవు. తుపాన్ ఆగిపోయిందనే భ్రమ కలుగుతుంది. కానీ అది తీరాన్ని దాటిన తర్వాత మళ్లీ తుపాన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది.
Also Read: వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ నుంచి ఖమ్మం- విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్ లు ఇవే
తుపాన్‌లకు ఆ పేర్లు ఎలా పెడతారు
ప్రాంతాలను బట్టి ఆ తుపాన్లకు పేర్లు నిర్ణయించడం సాంప్రదాయంగా వస్తోంది. అమెరికాలో తుపాన్లను టోర్నెడోలని, చైనాలో ఏర్పడే వాటిని టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే వాటిని సైక్లోన్స్ అని పిలుస్తారు. అలాగే ఆ్రస్టేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుపాన్లను విల్లీవిల్లీస్, వెస్ట్ ఇండీస్ (పశ్చిమ ఇండీస్) దీవుల్లోని తుపాన్ల ను హరికేన్స్ అంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004 సెపె్టంబరులో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెట్టారు. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారమే ఈ పేర్లు పెడుతుంటారు. పేర్లు కూడా పిలవడానికి సులువుగా, ఎనిమిది అక్షరాల లోపే పేర్లు ఉండాలి. ఎవరి భావోద్వేగాలు, విశ్వాసాలను దెబ్బతీసేలా పేర్లు ఉండకూడదు.
Also Read: Chandrababu: బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు చంద్రబాబు గైర్హాజరు, ఫోన్లోనే బాలయ్యకు విషెస్