అన్వేషించండి

Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !

Mohan Babu: మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్ బాబు న్యాయవాది విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది

Mohan Babu did not get relief in Telangana High Court:  పోలీసులు అరెస్టు చేయుకండా ఉండేందుకు మంచు మోహన్ బాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన జర్నలిస్టుపై చేసిన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం అడిగారు. దీంతో కేసును సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఈ లోపు తన క్లయింట్ ను పోలీసులు అరెస్టు చేస్తారేమోనని అప్పటి వరకూ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరారు. కానీ ఇప్పటికిప్పుడు అలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని.. కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే విచారణ జరుపి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ ప్రకారం మోహన్ బాబును పోలీసులు అరెస్టు చేయాలనుకుంటే  అడ్డంకులు లేవని అనుకోవచ్చు. 

మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య జరిగిన చిన్న ఘర్షణ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. అది పోలీస్ స్టేషన్లు, కేసుల వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఈ విషయాలు రిపోర్టు చేయడానికి మీడియా జల్ పల్లిలోని మంచు ఇంటి ముందు పడిగాపులు పడింది. గొడవ జరిగిన రోజున మంచు మనోజ్  ఇంటి తలుపులు తోసుకుని లోపలికి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయనతో పాటు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడికి దిగారు. ఓ టీవీ చానల్ జర్నలిస్టుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఆపరేషన్లు చేశారు. 

Also Read: KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ

ఇటీవల మీడియాతో మాట్లాడిన రాచ కొండ సీపీ సుధీర్ .. మోహన్ బాబుకు కోర్టు ఇరవై నాలుగో తేదీ వరకు గడువు ఇచ్చిందన్నారు. ఆయనను అరెస్టు చేయడంలో ఎలాంటి ఆలస్యం లేదన్నారు. అయితే పోలీసు ఎదుట హాజరు కాకుండా మాత్రమే హైకోర్టు చాన్స్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఇప్పుడు హైకోర్టు అరెస్టు విషయంలో రక్షణ కల్పించేందుకు నిరాకరించడంతో ఆయనను పోలీసులు అరెస్టు  చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.  

ఇటీవల మోహన్ బాబు తన దాడిలో గాయపడిన టీవీ జర్నలిస్టును కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వచ్చారు. 

Also Read: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Embed widget