అన్వేషించండి
Jagadhatri Serial Today March 5th: కౌషికి కుటుంబంపై పదేపదే దాడి చేస్తోంది ఎవరో జగధాత్రి కనిపెట్టిందా...? మీనన్ మనుషుల కోసం ధాత్రి వేట మొదలుపెట్టిందా..?
Jagadhatri Serial Today Episode March 5th: కౌషికి కుటుంబంపై పదేపదే దాడి చేస్తోంది ఎవరో జగధాత్రి కనిపెట్టిందా...? మీనన్ మనుషుల కోసం ధాత్రి వేట మొదలుపెట్టిందా..?

జగద్ధాత్రి సీరియల్ టుడే ఏపిసోడ్
Source : Zee5
Jagadhatri Serial Today Episode : రాజు నిజం చెప్పడంతో సుధాకర్ వైజయంతి చెంప పగులగొట్టి ఇంటికి తీసుకెళ్తాడు. ఇప్పటికైనా నిజం చెప్పినందుకు కౌషికి రాజుకు థ్యాంక్సు చెప్పి ఆస్పత్రి బిల్లు మొత్తం నేను చూసుకుంటానని చెబుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత జగధాత్రి, కేదార్ శ్రీవల్లిని ఓదార్చుతారు. మీరే లేకుంటే ఇవాళ నా జీవితం బుగ్గిపాలు అయ్యేదని శ్రీవల్లి బాధపడుతుంది.అయినా నాకు పెళ్లి చెడిపోయినందుకు బాధగా లేదని...కానీ అమ్మ నన్ను వదిలించుకుందామని ఇలాంటి పనిచేసినందుకే బాధగా ఉందని అంటుంది.
ఇంతలో అక్కడికి వచ్చిన కౌషికి...మీరు ఆ పెళ్లి కొడుకు గురించి పదేపదే నిజం చెబుతున్నా...పిన్నిమీద ఉన్న నమ్మకంతో నేనే పట్టించుకోలేదని అంటుంది. మీరు మాత్రం శ్రీవల్లికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారని కౌషికి అంటుంది. ఇకపై నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటానని శ్రీవల్లికి హామీ ఇస్తుంది.మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యతన తనదని కేదార్ అంటాడు. వైజయంతి అత్తయ్య ఇలాంటి పనిచేస్తారని ఊహించలేదని జగధాత్రి అంటుంది. మరోసారి ఇలా జరగుకుండా చూసుకోవాలని అనగా....ఇప్పటికే బాబాయి పిన్నితో మాట్లాడుతున్నారని....నేను కూడా రేపు గట్టిగా చెబుతానని చెబుతుంది.
మీనన్ మళ్లీ కనిపించడంతోపాటు బాబాయికి గన్ గురిపెట్టి కాల్చేందుకు ప్రయత్నిస్తుండటాన్ని చూసిన కౌషికి అదే తలచుకుని భయపడుతుంది. ఇంతలో ఆమె వద్దకు కేదార్, జగధాత్రి బ్యాగ్ తీసుకుని వస్తారు. ఏంటి ఇదని అడగ్గా...మీరు పెళ్లికొడుకుకు ఇచ్చిన కోటిరూపాయల క్యాష్ అని చెబుతారు. ఆ రాజు దొంగ అని మాకు తొలి నుంచీ అనుమానంగానే ఉందని...అందుకే మీరు డబ్బులు ఇచ్చినరోజే వైజయంతి అత్తయ్య పేరు చెప్పి వాళ్ల దగ్గర నుంచి కొట్టేశామని చెబుతారు.ఈ డబ్బులు కోసమైనా వాళ్లు బయటపడతారని మేమే దాచి ఉంచామని అంటారు.
మంచి పనిచేసి శ్రీవల్లి జీవితాన్ని కాపాడారని కౌషికి అంటుంది.ఎందుకు అలా ఉన్నారని అడగ్గా...మీనన్ విషయం గురించే ఆలోచిస్తున్నానని అంటుంది. మీరు దాని గురించి ఏం ఆలోచించొద్దని చెప్పి ధాత్రి, కేదార్ బయటకు వస్తారు. ఏదో ఒకసారి చనిపోయిన మనిషి కనిపించాడంటే భ్రమ అనుకోవచ్చని...కానీ రెండోసారి కూడా కనిపించాడని చెప్పినా నమ్మకపోతే మన మూర్ఖత్వం అవుతుందని జగధాత్రి అంటుంది. అసలు ఈ దాడుల వెనకు ఉన్నది ఎవరో తేలిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటుంది. వెంటనే రమ్యకు ఫోన్ చేసి...మీనన్ మనుషులపై నిఘా ఉంచమని చెబుతుంది.
ఆస్పత్రిలో నన్ను కొడతుంటే మీరు కనీసం అడ్డురాలేదని వైజయంతి కొడుకు,కోడలిపై మండిపడుతుంది. వస్తే మీతోపాటు మాకు నాలుగు దెబ్బలు పడేవని నిషిక అంటుంది. నువ్వు నాతో కూడా అబద్ధం చెప్పావని యువరాజు తల్లిపై మండిపడతాడు. శ్రీవల్లి నిజంగా నీ కూతురేనని అంటాడు. మేం ఏం అనుకోమని చెప్పినా ఎందుకు మా దగ్గర అబద్ధం చెబుతున్నావని అనగా....వైజయంతి ఆ అమ్మి అసలు నాకూతరే కాదని దబాయిస్తుంది.
వాళ్లు రెట్టించి అడగడంతో కేదార్ వాళ్ల చెల్లి అని చెప్పేస్తుంది. ఆ మాటలకు నిషిక షాక్ తిని...అంటే మామాయ్యగారి కూతురా అని అడగ్గా....లేదులేదు నేను నా స్నేహితురాలి కూతురు అని చెప్పబోయి అలా చెప్పానని మాటమారుస్తుంది. నా స్నేహితురాలు చచ్చిపోతూ ఈ అమ్మాయిని నా చేతుల్లో పెట్టి పోయిందని...అందుకే నేనే అనాథ ఆశ్రమంలో చేర్పించాని యువరాజుపై ఒట్టేసి చెప్పడంతో వాళ్లు నమ్ముతారు.
మీనన్ మనుషులపై నిఘా ఉంచిన పోలీసులకు డ్రగ్స్ సరఫరా ఓ నిందితుడిని పట్టుకుంటారు వాడిని విచారించిన జేడీ....గంజాయి ఎక్కడ నుంచి సరఫరా అవుతోందని అడగ్గా నాకు ఏం తెలియదని....మేం ఓ గేమింగ్‌యాప్‌లో ఆర్డర్ పెడతామని వాళ్లే తెచ్చిఇస్తారని చెబుతాడు. అమ్మేవాళ్లు ఎవరో కూడా మాకు తెలియదని చెబుతాడు. వాడు చెప్పినట్లే ఆ గేమింగ్‌యాప్‌లో జేడీ గంజాయి ఆర్డర్ పెడుతుంది.
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















